నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 4 మంచి టిఆర్పి రేటింగ్ రావడానికి ముఖ్య కారణం, మోనాల్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ. మోనాల్ ఈ షో లో ఇద్దరు వ్యక్తులతో బాగా క్లోజ్ గా ఉంటూ వచ్చింది. వారి మధ్య లవ్ నడుస్తుందేమో అన్న సందేహం తో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొండతో ఈ షో కు మంచి డిమాండ్ వచ్చింది. మోనాల్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ముందుగా అభిజిత్ తో క్లోజ్ గా ఉంటూ వచ్చింది. అభిజిత్ అభిమానులు మోనాల్ ఎలిమినేషన్ లో ఉన్న ప్రతిసారి కాపాడుకుంటూ వచ్చారు.
ఇదే క్రమంలో అఖిల్ మోనాల్ కు దగ్గర అయ్యాడు. విలిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నా కానీ వెంటనే కలిసి పోయి మాట్లాడుకునేవారు. అభిజిత్ కు మోనాల్ గురించి తెలిసిన తర్వాత కాస్త దూరం అయ్యాడు. కానీ అఖిల్ మాత్రం మోనాల్ తో క్లోజ్ గా నే ఉన్నాడు. వీరిద్దరి మధ్య లావ్ గట్టిగానే నడుస్తుంది అనుకున్నారు. నిజానికి మోనాల్ షో నుండి ఎప్పుడో బయటకు వెళ్ళాల్సింది కానీ. అభిజిత్ అండ్ అఖిల్ ల మధ్య ట్రైయాంగిల్ లవ్ కొంతకాలం ఆమెను కాపాడుకుంటు వచ్చింది.
ఆ తర్వాత బిగ్ బాస్ యజమాన్యం ఆమెకు ఓటింగ్ తక్కువ వచ్చిన చాలా కంటిన్యూ చెయ్యించారు. బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా అఖిల్ అండ్ మోనాల్ కలిసే ఇంటర్వ్యూ లు ఇవ్వడం సోషల్ మీడియా ద్వారా లైవ్ లోకి వచ్చి అభిమానులతో చిట్ చాట్ చేయడం వంటి పనులు చేశారు.
అలాగే ఇద్దరు కలిసి తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి అనే వెబ్ సిరీస్ కు ఒకే చెప్పడం. ఇవన్నీ కూడా మేము బయట కూడా ప్రేమ పక్షులమే అని చెప్పకనే చెప్పడం వంటివి చేశారు. తాజాగా ఇద్దరు కలిసి వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ ఉన్న ఫోటోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతున్నాయి. నెటిజన్స్ మాత్రం భిన్నమైన ట్రోల్ల్స్ తో రెచ్చిపోతున్నారు.