దేశ వ్యాప్తంగ కరోనా సెకండ్ వేవ్ యమ స్పీడ్ గా వ్యాపిస్తుంది. కొత్త లక్షణాలతో కరోనా ప్రజలను భయపెడుతుంది . డాక్టర్స్ సైతం ఏమి చేయలేని పరిస్థితులు వచ్చాయి. ఇది ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలు ముందు ముందు ఎదురు అవ్వనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ వైపు అడుగులు వెయ్యబోతుందని సమాచారం. మరో రెండు రోజుల్లో లాక్ డౌన్ పై ఓ క్లారిటి రాబోతుంది. కరోనా నుండి మనల్ని మనం రక్షించుకోవాలి అంటే మాస్క్ లు సానిటైజర్స్, సోషల్ డిస్టన్స్ పాటించాలి అని చెబుతున్నారు.
అయిన కొంతమంది వీటిని పెడచెవిన పెట్టి కరోనా భారీన పడుతున్నారు. సామాన్య ప్రజల నుండి సెలబ్రేటిల వరకు కరోనా భారీన పడ్డవారే.తాజాగా బిగ్ బాస్ ఫేమ్ హరి తేజ కరోనా వలన తను పడిన అనుభవాన్ని తన ఇంస్టా గ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. కరోనా సెకండ్ వేవ్ కు ముందు హరితేజ ప్రెగ్నెన్సీ తో ఉన్నారు. అప్పటికే నెలలు నిండి డెలివరీ కోసం ఎదురుచూస్తుంది. తీరా డెలివరీ టైమ్ రాగానే కరోనా యమ స్పీడ్ గా వ్యాపిస్తుంది. అలాంటి సమయంలో ఆమెకు తోడు ఉండాలిసిన ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆమె వెంట లేరు. దానికి కారణం వారికి కరోనా సోకడమే. అలాంటి పరిస్థితి లో హరితేజ ఒక్కరే హాస్పిటల్ కు వెళ్ళారు.
ఆ హాస్పిటల్ మొత్తం కోవిడ్ వార్డ్స్ తో నిండి పోయి ఉంది. అలాంటి పరిస్థితులను హరి తేజ ఫేస్ చేశారు. ఇక డాక్టర్స్ మాత్రం హరి తేజ డెలివరీ కి ముందు టెస్ట్ రిపోర్ట్ చూసి నార్మల్ అవ్వుతుందని చెప్పారు. డెలివరీ సమయంలో ఆమె భర్త తప్ప నా అనుకున్న వారు ఎవరు లేరు. తీరా డెలివరీ అయి పాప పుట్టిన వెంటనే ఆమె నుండి దూరంగా తీసుకువెళ్లి వేరే గదిలో ఉంచారు. అందుకు కారణం ఆమెకు కోవిడ్ పాజిటివ్ అని రావడమే. పాపకు నెగటివ్ అని వచ్చింది. తన బిడ్డను కూడా వీడియో కాల్ ద్వారానే చూశాను అని చెప్పారు.
ఫీడ్ ఇద్దామని అనుకున్న ఇచ్చే అవకాశం లేకుండా పోయిందని బాగా ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె చెప్పేది ఏమిటి అంటే ఇంట్లోనే ఉండండి మాస్క్ లు ధరించి మీ ప్రాణాలు కాపాడుకోండి. ఇక్కడ హాస్పిటల్ లో ఎంతో మంది కుటుంబాలు కరోనాకు ఛిద్రం అయిపోవడం కళ్ళారా చూశానని హరితేజ చెబుతున్నారు.