నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 3, సీజన్ 4 లు సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వుతున్నాయి. నాని హోస్ట్ గా చేసిన సీజన్ 2 కు మంచి టిఆర్‌పి రేటింగ్ రాకున్న అందుల్లో పాల్గొన్న కంటెస్టెంట్స్ మాత్రం సినిమాల్లో టివి ల్లో మంచిగానే రాణిస్తున్నారు. సీజన్ 3 హౌస్ మెంట్స్ మాత్రం అనుకున్న అంత అవకాశాలు రాలేదనే చెప్పాలి. ఈ విషయంపై సీజన్ 4 కంటెస్టెంట్ అలీ రేజ వివరణ ఇచ్చాడు.
బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా మేము హౌస్ లోకి వెళ్లినప్పుడు కరోనా మొదలైంది. అలాంటి సమయంలో సినిమా సెలబ్రేటీలు మరియు ప్రేక్షకులు అంత బిగ్ బాస్ సీజన్ 4 ను బాగా వీక్షించారు. అందుకే మాకు పబ్లిక్ లో మంచి పాపులారిటి వచ్చింది. బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చినప్పుడు ఉండే ఆదరణ.. ఎక్కువ రోజులు ఉండదు. అందుకే ఆ సమయంలోనే సినిమాల్లో అవకాశాలు సంపాదించుకోవాలి.
బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్స్ కు ఆఫర్లు అందుకునే సమయంలో ఇండియాలో కరోనా విజృంభణ మొదలవ్వడంతో కేంద్రం లాక్ డౌన్ ను విధించింది. అందుకే వారికి ఎక్కువ అవకాశాలు లేవు. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత మనకు వచ్చిన క్రేజ్ ను సరిగ్గా ఉపయోగించుకుంటే మన లైఫ్ టర్న్ అవ్వుతుంది. లేకపోతే ఇంకా ఎన్ని ఇంటర్వ్యూ లు ఇచ్చిన అవకాశాలు మాత్రం రావు. నాకు బిగ్ బాస్ 4 ప్లస్ అయ్యింది ఏమిటి అంటే చాలా మంది కంటెస్టెంట్స్ నా స్నేహితులే కావడం నాకు బాగా కలిసి వచ్చింది.