నీతేష్ తివారీ దర్శకత్వంలో అమీర్ ఖాన్ ముఖ్య పాత్రలో రూపొందిన చిత్రం దంగల్. ఇది ఓ రియల్ రెజ్లర్ జీవితం అదరంగా తీశారు. ఓలంపిక్ గేమ్స్ లో ఇండియా కు గోల్డ్ మెడల్ సాదించిన గీత పోఘాట్ యొక్క జీవిత చరిత్ర ఈ దంగల్ చిత్రం. ఈ చిత్రం విడుదలైన అన్నీ బాషల్లో మంచి విజయం సాదించింది. ఈ చిత్రంలోని గీత పోఘాట్ పాత్రలో ఫాతిమా సనా ఖాన్ అనే నటి నటించింది. రెజ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం ఉండటంతో ఆమె ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు.
ఈ చిత్రం తర్వాత ఫాతిమా సనా ఖాన్ బాలీవుడ్ సినిమాల్లో బిజీ అయిపోతుంది అనుకున్నారు, కానీ ఆమెకు పెద్దగా అవకాశాలు కూడా ఏమి రాలేదు. అందుకు కారణం బాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ అనేది విపరీతంగా ఉండటమే అని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూ లో అన్నారు. దర్శక, నిర్మాతలకు ఓ సారి ఛాన్స్ ఇస్తే అవకాశాలు వస్తాయి అని సంచలన ఆరోపణలు చేసింది. తనకు అలాంటివి ఇష్టం లేకనే చాలా సినిమాల్లో అవకాశాలు మిస్ అయ్యాయి అన్నారు. ఇక అలాగే తన జీవితంలోని ఓ చేదు సంఘటనను ఆమె గుర్తుచేసుకున్నారు.
నేను జిమ్ కు వెళ్ళి ఇంటికి తిరిగి వెళ్ళుతున్న సమయంలో ఓ అబ్బాయి నా వెంట ఫాలో అయ్యాడు. నేను ఎటువైపు వెళ్ళుతుంటే అటువైపే వస్తున్నాడు. అది గమనించిన నేను అతని వద్దకు వెళ్ళి ఎందుకు ఫాలో అవ్వుతున్నావు అని ప్రశ్నించగా అతడు నిర్లక్షంగా నా ఇష్టం నీకు ఎందుకు అన్నాడు. నువ్వు మరోసారి నా వెంట వస్తే నీ చెంప పగలకొడతాను అని చెప్పాను తాను కూడా నేను నీ చెంపపై కొడతాను అన్నాడు. ఇక కోపం ను కంట్రోల్ చేసుకోలేని స్థాయి కి నా ఫస్ట్రేషన్ వెళ్లిపోయింది.
వెంటనే అతని చెంప పై లాగి పెట్టి కొట్టాను. అతను కూడా నా చెంపపై ఘట్టిగా కొట్టాడు. ఆ తర్వాత అక్కడి నుండి ఇంటికి వెళ్ళిన నేను మా నాన్న కు అసలు విషయం చెప్పాను. మా ఫాదర్ అక్కడకు వచ్చేలోగా అతను వెళ్లిపోయాడు. అది నా జీవితంలో జరిగిన ఓ చేదు సంఘటన.