సుడిగాలి సుధీర్ కు మంచి పేరు రావడానికి కారణం ఇద్దరు వ్యక్తులు ఒక్కరు వేణు అయితే మరొకరు రష్మి. వేణు సుధీర్ ను జబర్దస్త్ తీసుకురాకుంటే ఎక్కడో మెజీషియన్ గా సెట్టిల్ అయ్యేవాడు. జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజుల తర్వాత రష్మి వెంటపడి ఆమెపై సెటైర్స్ వెయ్యడం అవి చాలా ఫన్నీ గా ఉండటం. దానికి తోడు జబర్దస్త్ తోటి కంటెస్టెంట్స్ రష్మి మరియు సుధీర్ ల మధ్య ఏదో వ్యవహారం నడుస్తుంది అని పుకార్లు పుట్టించడం అవి నిజమే అనుకోని ప్రేక్షకులు నమ్మడం. ఇవన్నీ సుధీర్ కు మంచి ప్లస్ అయ్యాయి.
సుధీర్ సక్సెస్ ఫుల్ లైఫ్ లో ఖచ్చితంగా రష్మి పాత్ర చాలా ఉంది. రష్మి ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్ షోకు జడ్జ్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో యొక్క లేటెస్ట్ ప్రోమోను రీసెంట్ గా విడుదల చెయ్యడంతో బాగా వైరల్ అవ్వుతుంది. ఈ ప్రోమోలో సుధీర్ తన మార్క్ స్టైల్ లో ఎంట్రీ ఇచ్చి బుల్లెట్ బాస్కర్ వైపు చూసి ఈ రోజు ప్రోగ్రామ్స్ ఏంటి అని అడుగుతాడు. అందుకు బుల్లెట్ భాస్కర్ బొంబాయ్ నుండి గార్మెంట్స్ కంపెనీ వాళ్ళు వచ్చారు. మిమ్ములను బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోవాలని భావిస్తున్నారని చెబుతాడు. ఇలోగా సుధీర్ అరే నన్ను బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోవడం ఏమిటి రా అంటే. బుల్లెట్ బాస్కర్ మీ గురించి మీకు తెలవడం లేదు మీరు జీవితాంతం ఇలాగే ఉండిపోతారా అసలు మీకు పట్టిన దరిద్రం ఎవరో తెలుసా చెప్పురా నరేశ్ అని అంటాడు.
అప్పుడు నరేశ్ మేడమ్ అంటూ రష్మి వైపు చూస్తూ రోజు సుధీర్ వెంటపడి రష్మి టార్చర్ పెడుతుంది నీ కళ్ళు పట్టుకుంటా ఇకనైనా సుధీర్ ను వదిలేయమ్మ అంటాడు. రష్మిక తో స్టెప్ లు వెయ్యాలిసిన రేంజ్ మా అన్న సుధీర్ ది కానీ రష్మి తో వేస్తున్నాడు. రష్మి సుధీర్ కు పట్టిన దరిద్రం అంటాడు… ఈ డైలాగ్ తో అక్కడ ఉన్న జడ్జెస్ మరియు కంటెస్టెంట్స్ అందరు నవ్వులు కురిపిస్తారు. పూర్తి ఎపిసోడ్ కోసం వచ్చే శుక్రవారం వరకు అగాలిసిందే.