ఆదర్శ్ బాలకృష్ణ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సినిమా ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ సందేశ్, నిఖిల్ మెయిన్ లీడ్ లో వచ్చిన చిత్రం హ్యాపీ డేస్. ఈ చిత్రంలో ఆదర్శ్ కాలేజీ స్టూడెంట్ గా నటించాడు. ఈ చిత్రంతో ఆదర్శ్ కు మంచి గుర్తింపు రావడంతో సినిమాల్లో అవకాశాలు రావడం మొదలు అయ్యాయి.
ఎన్టిఆర్ హోస్ట్ గా అప్పుడే బిగ్ బాస్ సీజన్ వన్ మొదలవ్వుతుంది. ఆ టైమ్ లో ఆదర్శ్ వన్ ఆఫ్ ది హౌస్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ ఆదర్శ్ ప్రవర్తన నచ్చి దాదాపుగా ఫైనల్ స్టేజ్ వరకు వచ్చాడు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత మంచి నేమ్ రావడంతో సినిమాలో మంచి మంచి పాత్రలు వచ్చాయి వాటిని ఆదర్శ్ చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు.
తాజాగా కరోనా ప్రభావం ఆదర్శ్ పై పడింది. అందువలన ఆయన సినిమా అవకాశాన్ని కోల్పోయినట్లుగా చెప్పాడు. రీసెంట్ గా ఆదర్శ్ బాలకృష్ణ ఫ్యామిలి కరోనా భారీన పడింది. ఈ విషయాన్ని ఆయన తాను నటించబోయే సినిమా వాళ్ళకు చెప్పాడు. ఇక తనకు మరో మాట చెప్పకుండానే ఆయనను ఆ పెద్ద సినిమా నుండి తొలగించినట్లుగా ఆదర్శ్ సోషల్ మీడియా వేధిక గా తన బాదను పంచుకున్నాడు. కరోనా సమయంలో షూటింగ్ లు లేక చాలా ఇబ్బందులు పడ్డట్లుగా ఆదర్శ్ బాలకృష్ణ చెప్పాడు.