తెలంగాణ ఉద్యమం భావి తరాలకు ఓ నిఘంటువు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి జీవితం ఓ స్ఫూర్తి ప్రదాయకం. అటువంటి ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఓ మహానీయుని కథాంశంతో ఫ్రెండ్లీ స్టార్ శ్రీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. జిషాన్ ఉస్మాన్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని మ్యాక్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించారు. వడత్యా హరీష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది.
ఈ సందర్భంగా దర్శకుడు వడత్యా హరీష్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ఉద్యమ చరిత్రను తెరకెక్కించే అవకాశం నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇటువంటి అదృష్టాన్ని ప్రసాదించిన మా నిర్మాత మహ్మద్ జాకీర్ ఉస్మాన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా ఇంత బాగా రావడానికి ఆయన చేసిన సపోర్ట్, సహకారం మరువలేనిది. ఈ చిత్రంలో 50కి పైగా స్టార్ నటీనటులు నటించారు. అందరికీ ధన్యవాదాలు. హీరో శ్రీకాంత్‌గారు మా టీమ్‌ని ఎంతో హుషారుగా ముందుకు నడిపించారు. వారికి చిత్రయూనిట్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నెల 23న చిత్రం థియేటర్లలోకి వస్తోంది. అందరూ ఆశీర్వదిస్తారని కోరుతున్నాను..’’ అని తెలిపారు.
చిత్ర నిర్మాత మహ్మద్ జాకీర్ ఉస్మాన్ మాట్లాడుతూ.. ‘‘ముందుగా అందరికీ నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. మా ‘తెలంగాణ దేవుడు’ చిత్రం చాలా బాగా వచ్చింది. ఈ చిత్రం కోసం శ్రీకాంత్ గారు ఇచ్చిన సహకారం, సపోర్ట్ మరిచిపోలేనిది. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. తెలంగాణ ప్రాంతాలలో తెలంగాణ కోసం ఉద్యమం చేసి సాధించుకున్న తర్వాత ఏర్పడిన పరిణామాల గురించి ప్రస్పుటంగా ఈ చిత్రం ద్వారా దర్శకుడు వడత్యా హరీష్ అద్భుతంగా చూపించబోతున్నాడు.
ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ చిత్రంతో మా అబ్బాయి జిషాన్ ఉస్మాన్ కూడా నటుడిగా పరిచయం అవుతున్నారు. సీనియర్ నటీనటులు ఎందరో ఈ చిత్రంలో నటించారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఏప్రిల్ 23న గ్రాండ్‌గా థియేటర్లలోకి మా ‘తెలంగాణ దేవుడు’ని తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాము. సహకరించిన అందరికీ ధన్యవాదాలు. ప్రేక్షకులందరూ కరోనా జాగ్రత్తలు పాటిస్తూ.. థియేటర్లలో మా సినిమాను చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను..’’ అని తెలిపారు