FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
Newsతెలుగు న్యూస్

100 మిలియన్ వ్యూస్ సాధించిన ‘సారంగ దరియా’

by Admin April 1, 2021
728

“లవ్ స్టోరి” చిత్రంలోని ‘సారంగ దరియా’ పాట యూట్యూబ్ వ్యూస్ లో కొత్త చరిత్ర సృష్టించింది. కేవలం 32 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్ సాధించింది. సౌతిండియాలో మరే లిరికల్ సాంగ్ ఇంత తక్కువ టైమ్ లో వంద
మిలియన్ మార్క్ చేరుకోలేదు. ‘రౌడీ బేబీ’, ‘బుట్ట బొమ్మ’ వంటి సంచలన పాటలు కూడా లిరికల్ సాంగ్ వ్యూస్ లో ‘సారంగ దరియా’ వెనకబడ్డాయి. ఫిబ్రవరి 28న ఆదిత్య మ్యూజిక్ ఛానెల్ లో అప్ లోడ్ అయిన ‘సారంగ దరియా’ పాట తొలి రోజు నుంచే శ్రోతలను ఆకట్టుకుని, రోజూ మిలియన్ల కొద్దీ వ్యూస్ అందుకుంటూ వచ్చింది.

‘సారంగ దరియా’కు సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ ఇచ్చిన క్యాచీ ట్యూన్, సుద్దాల అశోక్ తేజ అందించిన సాహిత్యం, ఉత్సాహంగా మంగ్లీ పాడిన తీరు సామాన్యుడి నుంచి విశిష్ట వ్యక్తుల దాకా అందరికీ నచ్చింది. ఇక ఈ పాటలో శేఖర్ మాస్టర్ స్టెప్పులను నాయిక సాయి పల్లవి తనదైన స్టైల్ లో మెరుపుతీగలా చేసింది. సాయి పల్లవి టైమింగ్, ఎనర్జీ, ఎక్స్ ప్రెషన్స్, ఇన్వాల్వ్ మెంట్ ‘సారంగ దరియా’ పాటకు ప్రధాన ఆకర్షణ అయ్యాయి.

“లవ్ స్టోరి” చిత్రంలో ‘సారంగ దరియా’ పాటను తీసుకోవాలి అని దర్శకుడు శేఖర్ కమ్ముల చేసిన ఆలోచన వందశాతం విజయవంతం అయ్యింది. ఈ సినిమాకు ‘సారంగ దరియా’ డ్రైవింగ్ ఫోర్స్ అయ్యిందని చెప్పొచ్చు. రేవంత్, మౌనిక లవ్ స్టోరిని ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల.

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. ”లవ్ స్టోరి” చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు,
దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటించారు.

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Ram Charan Snapped At Fans Meet Photos

  • 2

    “ఇక్షు” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..

  • 3

    Manappuram Miss Queen of India 2021 Grand Fashion Show Final

  • 4

    “Vakeel Saab” Theatrical Trailer Release Theaters List

  • 5

    ఏప్రిల్ 23న విడుదలవుతున్న “శుక్ర”

  • 6

    Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews