పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆమద్య రాజకీయాలతో బిజీ అయ్యి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. కాని ఆర్థిక పరమైన అవసరాల కారణంగా ఒక వైపు రాజకీయం చేస్తూనే మరో వైపు సినిమాలను చేసేందుకు వరుస ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టాడు. ఈ క్రమంలోనే వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ చిత్రాన్ని పూర్తి చేశాడు. ఆ చిత్రం బాలీవుడ్ పింక్ చిత్రానికి రీమేక్, అక్కడ ఘన విజయం సాదించడంతో తెలుగులో రీమేక్ చేశారు. ఆ చిత్రం తర్వాత మరో మూడు నాలుగు చిత్రాలను లైన్లో పెట్టాడు. అందులో క్రిష్ దర్శకత్వంలో సినిమా కూడా ఒక్కటి.
పీరియాడికల్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఇప్పటికే దర్శకుడు క్రిష్ఈ చిత్రం కోసం భారీ సెట్స్ ను హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో వేయించాడు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ వజ్రాల దొంగగా కనిపించనున్నాడు అని సమాచారం. 17వ శతాబ్దాల కాలం కు చెందిన మొఘలుల కోహినూరు వజ్రం నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతుందని సమాచారం. నేడు మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ చిత్రం నుండి ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. వీడియోలో పవన్ లుక్ అదిరి పోయింది. సినిమా అంచనాలను మించి ఉంటుందనిపిస్తుంది. దర్శకుడు క్రిష్ కు పవన్ ఫ్యాన్స్ కృతజ్ఞతలు చెప్పుకునే విధంగా సినిమా ఉంటుందని ఈ చిన్న వీడియో ను చూస్తుంటే అనిపిస్తుంది. ఇక ఈ సినిమా టైటిల్ విషయమై చాలా ప్రచారం జరిగింది. ఈ చిత్రానికి విరూపాక్ష, బందిపోటు, హర హర మహదేవ్ వంటి టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. కానీ చిత్ర బృందం హరి హర విరమల్లు అనే టైటిల్ ను ఫైనల్ చేశారు.
శివరాత్రి సందర్బంగా ఇంత అద్బుతమైన కానుక ఇచ్చినందుకు అభిమానులు క్రిష్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కీరవాణి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పవన్ పాత్రను మరింత ఎలివేట్ చేసే విధంగా ఉంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుంది. ఈ చిత్రాని ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఫస్ట్ లుక్ మరియు గ్లిమ్స్ వీడియో చూసిన తర్వాత అభిమానులు ఇంకెప్పుడు సినిమా విడుదల చేస్తారా అంటూ ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా విడుదల కాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది, తాజా వీడియోలో మరోసారి క్లారిటీ ఇచ్చారు.