బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ప్రస్తుతం పూరీజగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడు. అనన్య తన జీవితంలో ఎన్నో మానసికంగా బాదించే మాటలను ఎదురుకున్నాను అని ఆమె వాపోయింది అందుకే సోషల్ మీడియాలో సొ పాజిటివ్ పేరుతో ఓ ప్రచారని తీసుకువచ్చను అని చెప్పారు. సోషల్ మీడియా నుండి వచ్చే నెగటివ్ కామెంట్స్ మరియు ట్రోల్స్ ను అరికట్టడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నన్ను చూసి చాలా మంది అబ్బాయిల ఉన్నావని అంటుండేవారు.
వారి మాటలు నన్ను ఎంతగానో బాదించేవి.. ఎందుకు అంటే కెరీర్ ను ఎంచుకునే సమయంలో అలాంటి మాటలు వినప్పుడు మనసుకు చాలా బాద గా ఉండేది. నేను మా అమ్మ నన్నలతో దిగిన ఓ ఫోటో అందులో నేను చాలా సన్నగా ఉండేదాన్ని అది చూసినవాళ్లు నువ్వు అచ్చం అబ్బాయిల ఉన్నావని అంటుండేవారు. ఆ విషయం మా పేరెంట్స్ కూడా చెప్పాను. ఎందుకు అంటే ఆ మాటలు అంటుంటే మనలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. మొదట్లో చాలా బాధ పడ్డాను కానీ ఆ తర్వాత అలాంటి వారిని వారి మాటలను పట్టించుకునే దాన్ని కాదు. ఆ మాటలు విని తెగ ఎంజాయ్ కూడా చేశాను అని అన్నారు.
అనన్య సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో ఇండస్ష్ట్రి కి పరిచయం అయ్యింది. ఆ తర్వాత అక్కడ మొత్తంగా ఐదు చిత్రాలో నటించింది. ప్రస్తుతం శాకూన్ బాత్ర దర్శకత్వంలో ఈ చిత్రంలో నటిస్తుంది. ఇంకా టైటిల్ ను అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో ప్రకటించనున్నారు. తెలుగు లో లైగర్ అనే చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం ద్వారా ఇక్కడ స్టార్ హీరో ల సినిమాలో ఛాన్స్ లు కొట్టేయ్యాలని చూస్తుంది.