స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ కేర్తికేయ హీరోగా నటించిన చావు కబురు చల్లగా ఈవెంట్ కు ముఖ్య అతిది విచ్చేశాడు. అల్లు అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తరలి వచ్చారు. దర్శకుడు సుకుమార్ కూడా ఈ చిత్రం అక్కడ సందడి చేశాడు. ఈ మధ్య పుష్ప చిత్రం నుండి కాస్త విరామం తీసుకున్న టీమ్ ఇప్పుడు ఎక్కడ ఎలాంటి సినిమా ఫంక్షన్ జరిగిన సుకుమార్ వెళ్ళుతున్నాడు.
ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ… నేను జీవితంలో సంపాదించుకుంది అభిమానులను మాత్రమే.. అసలు కరోనా సమయంలో థియేటర్స్ కు ప్రేక్షకులు వస్తారా రారా అని ఎదురుచూస్తున్న తరుణంలో మీరు సినిమాలు చేయండి మేము వస్తాం అని చెప్పిన ప్రేక్షక దేవుళ్ళకు నా కృతజ్ఞతలు తెలిపాడు. ఈ చిత్రం నేను ఆల్రెడీ చూశాను చాలా బాగుంది. బస్తి బలరాజుగా కార్తికేయ మంచి నటన కనబరిచాడు.
ఈ చిత్రం యొక్క దర్శకుడు కౌశిక్ గురించి మాట్లాడలేక ఉండకున్న.. ఎందుకు అంటే ఇంత తక్కువ వయసులో ఇలాంటి ఫిలాసఫీ సినిమా తియ్యడం చాలా గ్రేట్.. లావణ్య త్రిపాటి చాలా బాగా నటించింది.. ఆమని గారు కూడా తన పాత్రకు సరైన న్యాయం చేశారు అని తెలిపాడు… చివరిగా బన్నీ తన సినిమా పుష్ప గురించి మాట్లాడుతూ తగ్గేది ల్యా అని అన్నాడు.
ఇంకా సుకుమార్ మాట్లాడుతూ… పుష్ప చిత్రం తో బన్నీ ఇకానిక్ హీరోగా మారిపోతాడు.. అల్లు అభిమానుల అంచనాలకు తగ్గకుండా పుష్ప చిత్రం ఉంటుందని సుకుమార్ అన్నాడు.. కార్తికేయ మాట్లాడుతూ… బన్నీ నా చిత్రానికి గెస్ట్ గా రావడం నాకు జీవితాంతం గుర్తుండి పోతుందని అన్నాడు.. మార్చి 19వ తేదీన ఈ చిత్రం విడుదల అవ్వుతుంది.