నటి వరలక్ష్మి శరత్ కుమార్ తమిళ సినిమా ఇండస్ష్ట్రి కి పోడా పొడి అనే చిత్రంతో నటిగా పరిచయం అయింది. ఆ తర్వాత హీరోయిన్ గా అక్కడ కొన్ని సినిమాల్లో నటించింది. స్టార్ హీరోయిన్ గుర్తింపు రాలేదు. ఆమె తండ్రి శరత్ కుమార్ అక్కడ స్టార్ హీరో. కూతురు హీరోయిన్ గా గా గుర్తింపు దక్కక పోవడంతో ఆమె విలన్ వేషాలు కూడా వేసింది. విశాల్ హీరోగా నటించిన సండకొజ్జీ 2 లో ప్రతినాయక పాత్రలో నటించింది.
ఆ పాత్ర ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. కానీ సినిమా మాత్రం ఆడలేకపోయింది ఆ తర్వాత తెలుగులో సందీప్ కిషన్ హీరోగా నటించిన తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ ద్వారా ఆమె టాలీవుడ్ కు పరిచయం అయింది. ఆ తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందిన క్రాక్ చిత్రంలో జయమ్మ పాత్రలో నటించి మెప్పించింది. నెగటివ్ షెడ్ ఉన్న పాత్రలో ఆమె ఆకట్టుకుంది. ఈ చిత్రంలోని ఆమె పాత్రకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
నేడు ఆమె పుట్టిన రోజు కావున ఈ సందర్భంగా ఆమెకు విషెస్ ను సోషల్ మీడియా వేధిక ఆమె అభిమానులు తెలియజేస్తున్నారు. ఇంస్టాలోని ఆమె అందాలు చూస్తే మతులు పోవాలిసిందే. అలాంటి ఫోటోలను ఆమె పోస్ట్ చేస్తూ ఉంది. ఫాలోవర్స్ సంఖ్య కూడా లక్షకు దగ్గరలో ఉంది. తాజాగా ఆమె అల్లరి నరేశ్ నాంది చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో ఆమె లాయర్ పాత్రలో నటించింది. ఈ చిత్రం హిట్ట్ అవ్వడంతో ఆమెకు తెలుగులో వరస సినిమా అవకాశాలు వస్తున్నాయి.
కన్నడలో ఆమె నటించిన మూడు చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. తమిళంలో ఓ నాలుగు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ప్రస్తుతం అవి అన్నీ సెట్స్ పైనే ఉన్నాయి.