యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధా కృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ అనే చిత్రాని పూర్తి చేశాడు. పీరియాడికల్ నేపథ్యం కలిగిన రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీగా రూపొందుతుంది. ఈ నేపథ్యంలో మరో రెండు పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టాడు అందులో ఓ సినిమా సెట్స్ పైన ఉన్నది. మరో సినిమా త్వరలో సెట్స్ పైకి రానున్నది. కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.
ఇప్పటికే ఈ చిత్రం యొక్క షూటింగ్ తెలంగాణలోని గోదావరిఖని జిల్లాలోని బొగ్గు గనుల్లో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. నెక్స్ట్ షెడ్యూల్ ను త్వరలో మొదలు పెట్టనున్నది. ఈ క్రమంలో సలార్ టీమ్ ఇటీవల ఈ చిత్రంలో నటించే ఆర్టిస్ట్ లకోసం కొంతమంది డ్యాన్సర్స్ ను మార్షల్ ఆర్ట్స్ వచ్చిన వారిని సెలెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత ప్రభాస్ నటిస్తున్న స్ట్రెయిట్ హింది మూవీ అధిపురుష్. హిస్టారికల్ నేపథ్యం కలిగిన రామాయణం చరిత్రను ఈ చిత్రంతో తెర రూపంలోకి తీసుకు వస్తున్నాడు దర్శకుడు ఓం రౌత్.
ఈ చిత్రంకోసం భారీగా విజువల్ ఎఫ్ఫెక్ట్స్ ను ఉపయోగించనున్నాడు. ఇప్పటికే 200 మందితో కలిసి ఈ వర్క్ ను ఓం రౌత్ స్టార్ట్ చేశాడు. ఈ చిత్రంలో రావణ్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తుంటే. సీత పాత్రలో కృతి సనన్ ను తీసుకొనున్నారు. లక్ష్మణుడు కోసం సన్నీ సింగ్ ను తీసుకున్నారు. ఇటీవలే అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ చిత్రం కోసం ప్రభాస్ తన దేహ దారుడ్యాన్ని మార్చుకునే పనిలో ఉన్నాడు. అవును రోజుకు రెండు పుటల వర్క్ ఔట్స్ చేస్తున్నాడు. అందుకోసం ప్రభాస్ ట్రైనర్ రెబల్ స్టార్ ను బాగా కష్టపెడుతున్నాడు.
రోజుకు రెండు సార్లు వర్క్ ఔట్స్ చెయ్యాలిసిందే లేకపోతే కష్టమే అంటున్నాడు ప్రభాస్ కూడాను. ఎందుకు అంటే శ్రీ రాముడు లాంటి టోన్డ్ అండ్ లీన్ బాడీని తయారు చూసుకునే పనిలో ప్రభాస్ ఉన్నాడు. త్వరలో ఈ చిత్రం యొక్క షూటింగ్ ప్రారంభం అవ్వనున్నది. నిజానికి ఈ చిత్రం యొక్క షూటింగ్ ఎప్పుడో మొదలు అవ్వాలిసింది కానీ ఇటీవల షూటింగ్ సెట్ లో అగ్ని ప్రమాదం జరిగి సెట్ మొత్తం కాలి బూడిద అయింది. అందుకే షూటింగ్ లేట్ అవ్వుతుంది.