సీనియర్ హీరోలకు హీరోయిన్ కష్టాలు ఉంటాయి. కానీ ఈ మధ్య యంగ్ హీరోలకు కూడా ఆ కష్టాలు మొదలు అయ్యియి అంట. అవును గోపిచంద్ వంటి స్టార్ హీరో కి హీరోయిన్ దొరకడం లేదు అంట… మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షల్ అనే చిత్రం చేయనున్నాడు. ఈ సినిమా పై హైప్ తీసుకురావడానికి ఈ టైటిల్ ను ఖరారు చేశాడు దర్శకుడు.
ఈ చిత్రంలో హీరోయిన్ గా ముందు రాశి ఖన్నాను అనుకున్నారు అంట. సరైన సక్సెస్ లేని నటిగా ఆమె పై ముద్ర పడింది. పైగా ఆమె నటించిన చాలా సినిమాలు ఫ్లాప్ లు కావడంతో చాలా మంది దర్శక నిర్మాతలు ఆమెను తమ సినిమాలోకి తీసుకోవాలంటే భయపడిపోతున్నారు. అలాంటి సమయంలో మరో హీరోయిన్ కోసం అన్వేషణలో ఉన్న టీమ్ సాయి పల్లవి పేరును తెరపైకి తీసుకు వచ్చింది.
కానీ ఇప్పటికే ఆమెకు తీరిక లేకుండా ఉంది. చేతి నిండా తెలుగు, తమిళ, మలయాళ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందుకే ఆమెకు డేట్స్ ఆడ్జెస్ట్ కాలేదు. ఇక చివరిగా మరల రాశి ఖన్నా కోసమే పరిగెత్తడం… గోపిచంద్ కూడా ఆల్రెడీ ఆమెతో జిల్ మూవీ చేయడం జరిగింది. అందుకే గోపి, రాశిఖన్నా నే రిఫర్ చేసినట్లుగా సమాచారం.
ఇక ఆయన కోరిక మేరకే రాశిఖన్నా ను ఈ చిత్రంకోసం ఫైనల్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం బాలీవుడ్ మూవీకి రీమేక్ అంటూ బయట టాక్ వినపడుతుంది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన జాలీ ఎల్ఎల్బి 2 చిత్రాని తెలుగు నేటివిటీ కి తగిన విదంగా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసి పక్కా కమర్షల్ చిత్రంగా మారుతి ఈ చిత్రాని రూపొందించనున్నాడు అని తెలుస్తుంది.
త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ రానున్నది. ఈ చిత్రం యొక్క షూటింగ్ మార్చి 5 నుండి రేగ్యూలర్ షూటింగ్ జరుపుకొనున్నది. ఇప్పటికే పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అల్లు అరవింద్ సమర్పణలో యూవి క్రియేషన్స్, జిఏ2 సంస్థలు ఈ చిత్రాని నిర్మించనున్నాయి.