Inspired by Pawan Kalyan Garu’s Tweet, I Would like to contribute 70 lakh towards the Centre and States of Telangana and Andhra Pradesh Relief Fund in this moment of crisis.
I would like to applaud the commendable efforts of or Honourable Prime Minister Narendra Modi Ji & Honourable Chief Ministers of or respective states. KCR Garu and Jagan Mohan Reddy Garu in curtailing the vast effects of the pandemic COVID 19.
As a responsible citizen, I encourage all to strictly abide by their rules & recommendations. Jai Hind
–Ram Charan
ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి ప్రమాదకరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సామాన్యులను ఆదుకునేందుకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కరోనా నిర్మూలనా చర్యలకు రూ.70 లక్షలు విరాళమిస్తున్నట్లు ప్రకటిస్తూ తొలి ట్వీట్ చేశారు.
‘‘పవన్ కల్యాణ్‌గారి ట్వీట్ చూసి స్ఫూర్తి పొందాను. కరోనా(కోవిడ్ 19) నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.70 లక్షల రూపాయలను అందిస్తున్నాను. కరోనా నివారణకు గౌరవనీయులైన ప్రధాని మంత్రి నరేద్రమోదీగారు, మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌గారు, జగన్ మోహన్‌రెడ్డిగారు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం. బాధ్యత గల పౌరుడిగా ప్రభుత్వాలు సూచించిన నియమాలను పాటించాలని కోరుతున్నాను’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు రామ్‌చరణ్.
కరోనా నిర్మూలనా చర్యలకు రూ.70 లక్షలు విరాళం ఇచ్చినందుకు రామ్‌చరణ్‌కు తన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా హృదయ పూర్వక అభినందనలు తెలిపారు.