పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్ ను దక్కించుకుంది. సినిమా రిలీజ్ కు ముందు వకీల్ సాబ్ కు సంబందించిన ప్రమోషన్స్ కార్యక్రమాలు జరిగినాయి ఆ సమయంలో నివేత, అంజలి వంటి హీరోయిన్స్ కరోనా భారీన పడ్డారు. పవన్ కళ్యాణ్ కూడా వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ సమయంలో కరోనా భారీన పడినట్లుగా భారీ ఎత్తున్న ప్రచారం జరిగింది.
పవన్ కు కరోనా అంటూ వార్తలు రావడంతో అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. తాజాగా పవన్ కళ్యాణ్ కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోగ అందులో నెగటివ్ అంటూ రిపోర్ట్ వచ్చింది. పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓ రెండు చిత్రాలను సెట్స్ పైకి తీసుకెళ్ళాడు. మలయాళం మూవీ అయ్యపనుమ్ కొషియమ్. మరో చిత్రం వచ్చేసి హరహర వీరమళ్లు ఈ రెండు చిత్రాలు కూడా చాలా పెద్ద సినిమాలు.
ఇప్పటికే సగం షూటింగ్ ను పూర్తి చేసుకున్నాయి. పవన్ కు కరోనా అని వార్తలు రావడంతో కొన్ని రోజులు షూటింగ్ పోస్ట్ పోన్ చేశారు. కానీ కరోనా పరీక్షలు చేయించుకున్న పవన్ నెగటివ్ రిపోర్ట్స్ రావడంతో మరల తిరిగి షూటింగ్ లకు పయనం అవ్వుతున్నాడు.