* రూ.2 కోట్ల విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్
* ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ. కోటి
* ఆంధ్రప్రదేశ్ కు రూ.50 లక్షలు, తెలంగాణకు రూ.50 లక్షలు
Taking inspiration from Power Star @PawanKalyan’s tweet, Megapower Star @AlwaysRamCharan announces 70 Lakhs towards Central, Telangana and Andhra Pradesh Relief Funds. This is his first tweet from his official id.
దేశంలోగాని,తెలుగు రాష్ట్రాలలోగాని ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు నేను సైతం అంటూ.. మానవత్వాన్ని చాటే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కరోనా వైరస్పై కేంద్ర ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాలు చేస్తున్న పోరాటానికి రూ. 2 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ప్రధానమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో రూ. 50 లక్షల వంతున అందచేస్తారు. ఈ విరాళాలను ప్రభుత్వాలకు అందచేయడానికి ఏర్పాటు చేయవలసిందిగా పార్టీ ముఖ్య ప్రతినిధులను శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్నందున స్వయంగా వెళ్లి అందచేయడం సాధ్యం కానందువల్ల బ్యాంకుల ద్వారా విరాళాలు అందించే ఏర్పాటు చేయవలసిందిగా సూచించారు. పోరాటంలో గాయపడిన, అమరులైన సైనికుల కుటుంబాల కోసం గత నెల 20వ తేదీన ఢిల్లీ లోని సైనిక సంక్షేమ బోర్డుకు కోటి రూపాయలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందచేసిన విషయం విదితమే.