
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ విషయంలో ప్రేక్షకులకు ఒక అవగాహన అంటూ వచ్చేసింది. మొదటి రెండు మూడు రోజులు కంటెస్టెంట్స్ విషయంలో పెదవి విరిచిన ప్రేక్షకులు ఆ తర్వాత వాళ్లకు అలవాటయ్యారు. ఇతర విషయాలతో కనెక్ట్ అవుతున్నారు.
ఈ సీజన్ లో ఎక్కువగా అందమైన అమ్మాయిలు ఉండటంతో యూత్ ఆడియన్స్ ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్ మోనాల్ గజ్జర్, దివి, అరియానా, హారిక లు షో ను రక్తి కట్టిస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి రెండు రోజులు చాలా సైలెంట్ గా ఉన్న దివి ఆ తర్వాత రెచ్చిపోయింది.
ప్రస్తుతం ఆమెకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ఇటీవల ఎపిసోడ్ లో లాస్యతో ప్రవర్తించిన తీరు తో ఆమె మరింతగా పాపులర్ పొందింది. తనకు తోచిన విషయాన్ని నేరుగా మొహంపైన చెప్పేసే ఆమెకు బిగ్ బాస్ విన్నర్ అయ్యే లక్షణాలు ఉన్నాయంటూ ప్రేక్షకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఇదే విషయాన్ని పోసాని కృష్ణమురళి కూడా వ్యక్తం చేశాడు. ఏదైనా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే రచయిత నటుడు పోసాని కృష్ణ మురళి తనకు పరిచయం ఉన్న దివి ఈ సీజన్ బిగ్ బాస్ విన్నర్ గా నిలుస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. కచ్చితంగా ఆమెకు గెలిచే లక్షణాలు ఉన్నాయని పేర్కొన్నాడు. ఆమెతో వర్క్ చేసిన అనుభవం ఉన్న కారణంగా తాను ఈ విషయాన్ని చెబుతున్నట్లుగా పోసాని పేర్కొన్నాడు.
