మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనా వారి వారి వర్క్ లైఫ్ లో చాలా బిజీగా ఉంటారు. ఒక్కరు టాలీవుడ్ లో టాప్ హీరో అయితే మరొక్కరు ప్రజల ప్రాణాలు కాపాడే డాక్టర్. గడిచిన ఏడాది నుండి చాలా మంది కరోనా భారీన పడి చనిపోయినవారు ఉన్నారు. కరోనా ను జయించిన వారు ఉన్నారు. రామ్ చరణ్ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండటం వలన ఆయన కరోనా భారీన పడ్డాడు.
ఈ నేపథ్యంలో ఆయన క్వారంటైన్ కు వెళ్ళాడు. ఈ విషయంపై ఆయన భార్య ఉపాసనా మాట్లాడుతూ మాకు 2012 లో మ్యారేజ్ అయింది. ఆ సమయం నుండి నేను ఇంతవరకు చరణ్ విషయంలో కానీ నా విషయంలో కానీ భయపడింది లేదు కానీ చరణ్ కరోనా సోకింది అన్న వెంటనే కాస్త కంగారూ పడ్డాను. నేనుకూడా టెస్ట్ చేపించుకోవడంతో నాకు నెగటివ్ వచ్చింది. డాక్టర్స్ నీకు కూడా కరోనా వచ్చే అవకాశం ఉండొచ్చు అని చెప్పడంతో చరణ్ తో పాటుగా నేను క్వారంటైన్ లోకి వెళ్ళాను.
ఆ క్వారంటైన్ లోకి వెళ్ళిన రెండు రోజులు చాలా భయపడ్డం. కాస్త ఇబ్బందిగానే అనిపించింది. ఆ తర్వాత ఒక్కరిపై ఒక్కరికి ఉన్న ప్రేమానురాగలతో కరోనాను జయించి భయటపడ్డం అన్నారు ఉపాసన. ఇక రామ్ చరణ్ సినిమా విషయానికి వస్తే తన తండ్రితో కలిసి ఆచార్య అనే చిత్రంలో నటిస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం క్లైమాక్స్ కు చేరుకుంది.
ఈ చిత్రం తర్వాత వంశీ పైడి పల్లి తో ఓ సినిమా ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఉపాసన తన యస్ యుస్వల్ గా తన డాక్టర్ లైఫ్ లో బిజీగా ఉంది.