ఈ సంక్రాంతి కి రవి తేజ హీరోగా గోపి చంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన చిత్రం “క్రాక్”. శృతిహాసన్ కథానాయకిగా నటించింది. తమిళ దర్శకుడు సముద్రఖని కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రం విడుదలై మంచి టాక్ ను దక్కించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ ను కురిపిస్తుంది. “క్రాక్” కు పోటీగా తమిళ చిత్రం “మాస్టర్” ఈ నెల 14న విడుదలైంది.
ఈ చిత్రాన్ని కార్తీ “ఖైదీ” ఫేమ్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం డివైడ్ టాక్ తో మంచిగానే రానిస్తుంది. ఈ సమయంలో వరంగల్ కు చెందిన డిస్ట్రిబ్యూటర్ శ్రీను దిల్ రాజు పై సంచలన ఆరోపణలు చేశాడు. నేను డిస్ట్రిబ్యూట్ చేసిన క్రాక్ కు సరైన థియేటర్లు ఇవ్వలేదని అన్నాడు. రవి తేజ క్రాక్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంటే ఇప్పుడు ఈ చిత్రంకు థియేటర్స్ ను తగ్గించడం. మాస్టర్ కు థియేటర్స్ ను దిల్ రాజు పెంచడంపై విరుచుకుపడ్డాడు.
దిల్ రాజు పేరును కిల్ రాజు గా మార్చాలని అన్నాడు. సంక్రాంతికి తెలుగు సినిమాలను కాదని తమిళ సినిమాలకు ఎలా ప్రాధాన్యం ఇస్తారని ప్రశ్నించాడు. మంచి వసూళ్లు సాదిస్తున్న క్రాక్ చిత్రంను థియేటర్స్ నుండి తీసివెయ్యడం బాదగ ఉందని అన్నాడు. రవి తేజ చిత్రంకు పబ్లిక్ నుండి మంచి టాక్ వస్తుంది కావున ఇలా మాట్లాడవలసి వస్తుందని వరంగల్ డిస్ట్రిబ్యూటర్ ఆవేదన వ్యక్తం చేశాడు.