పవన్, రానా కాంబినేషన్ లో అయ్యపనుమ్ కొషియమ్ అనే మలయాళం మూవీ తెలుగులో సాగర్ చంద్ర దర్శకత్వంలో రీమేక్ అవ్వుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గ నటిస్తుంది. పవన్ కు భార్య గా కనిపించనున్నదని సమాచారం. ఇక ఈ చిత్రానికి మరో దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పని చేస్తున్నాడు. ఆయన రాకతో సినిమా అంచనాలు పెరిగాయి.
ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఈ చిత్రం నుండి మరో గుసగుస ఫిల్మ్ నగర్ సర్కిల్ నుండి వినపడుతుంది. యాక్షన్, ఫ్యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన దర్శకుడు వివి వినాయక్ ఈ చిత్రంలో ఓ అతిది పాత్రలో నటిస్తాడు అంటున్నారు. మేకర్స్ నుండి ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. త్వరలో వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దిల్ రాజు నిర్మాణంలో ఈ దర్శకుడు శీనయ్య చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
ప్రస్తుతం నటుడుగాను, దర్శకుడు గా వివి వినాయక్ కొనసాగుతున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ఛత్రపతి చిత్రాని బెల్లం కొండ సాయి శ్రీనివాస్ హీరోగా బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రంతో బాలీవుడ్ లోకి ప్రవేశించి అక్కడ తన ట్యాలెంట్ నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు.
పవన్ కళ్యాణ్ సినిమా విషయానికి వస్తే వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వకీల్ సాబ్ చిత్రాని పూర్తి చేశాడు. ఈ చిత్రం నుండి ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేశారు. క్రిష్ డైరెక్షన్ లో ఓ పీరియాడికల్ మూవీలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. దీనికి హరిహర విరమల్లు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ నెలలో ఈ చిత్రం యొక్క టైటిల్ విషయంలో ఓ క్లారిటీ రానున్నది. రానా కూడా విరాటపర్వం చిత్రంను పూర్తి చేశాడు ఏప్రిల్ 30 న ఈ చిత్రం విడుదల అవ్వుతుంది.