అంత అనుకున్నట్లే విశాల్ – అనిషా పెళ్లి రద్దుయినట్లు తెలుస్తుంది. ఈ ఏడాది మార్చిలో అనీషా అనే అమ్మాయితో విశాల్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. అయితే నడిఘర్ సంఘం భవనం పూర్తయిన తరువాత ఆ భవనంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న విశాల్ పెళ్లి డేట్ను నిశ్చితార్థం రోజు ప్రకటించలేదు. ఆ తర్వాత అనీషా తన సోషల్మీడియా అకౌంట్లో ఎంగేజ్మెంట్ ఫోటోలు డిలీట్ చేయడంతో విశాల్ తో పెళ్లి రద్దయిందనే వార్తలు విలిపించాయి.
కానీ విశాల్ తండ్రి అదేమీ లేదని చెప్పుకొచ్చాడు. అయినాగానీ సోషల్ మీడియా లో మాత్రం ఆ వార్తలు అలాగే చక్కర్లు కొట్టాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అనీషా రెడ్డికి ఓ యువ వ్యాపారవేత్తతో వివాహం నిశ్చయమైందట. త్వరలోనే వీరి వివాహం చేసేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేస్తున్నారట. విశాల్ – అనిషా ల మధ్య మనస్పర్థలు రావడంతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు కోలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది.