తమిళ నటుడు విజయ్ సేతుపతి ఒక్కో సినిమాతో తన స్టామినా పెంచుకుంటూ పోతున్నాడు. తనకు వచ్చిన ప్రతి అవకాశాని సద్వినియోగం చేసుకుంటూ వెళ్ళుతున్నాడు. ఒక్కప్పుడు సినిమా కు తన మొఖం పనికి రాదు అన్నవారే నేడు తన సినిమా డేట్స్ కోసం వెంటపడుతున్నారు. హీరో ఎవరైనా సరే విలన్ గా మాత్రం విజయ్ సేతుపతి ఉంటే చాలు సినిమా కచ్చితంగా హిట్టు అవ్వుతుందని నమ్మకంతో ఉన్నారు.
ఈ మధ్యన ఆయన నటించిన సినిమాలు వరస హిట్స్ ను దక్కించుకుంటున్నాయి. తమిళ నటుడు విజయ్ తో మాస్టర్ అనే చిత్రంలో ప్రతి నాయకుడు పాత్రలో నటించి మెప్పించాడు. ఇప్పుడు తెలుగు, తమిళ చిత్రాలే కాకుండా బాలీవుడ్ నుండి కూడా అవకాశాలు వస్తున్నాయి. హిందీలో షాహిద్ కపూర్, రాశిఖన్నా ప్రదాన పాత్రలో ఓ వెబ్ సిరీస్ రూపొందనున్నది. అందులో ఓ కీలక పాత్ర కోసం విజయ్ సేతుపతి నటించనున్నాడు. అందుకు ఆయన రెమ్యూనరేషన్ 55 కోట్లు వరకు తీసుకుంటున్నాడు.
షాహిద్ కపూర్ కు 40 కోట్లే తీసుకుంటున్నట్లుగా సమాచారం, ఈ వెబ్ సిరీస్ సున్నీ పేరిట రూపొందనున్నది. రాజ్ దీనికి దర్శకత్వం వహించనున్నాడు. అమెజాన్ ప్రైమ్ లో డిసెంబర్ నెల నాటికి స్ట్రిమింగ్ అవ్వనున్నది. తెలుగులో మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ హీరోగా ఉప్పెన చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అల్లు అర్జున్ పుష్ప లో కూడా విజయ్ సేతుపతి నటించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.