కోలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి (Vijay Sethupathi)కి సౌత్ లో అన్ని భాషల్లో సూపర్ క్రేజ్ ఉంది. ముఖ్యంగా తెలుగులో అతనంటే ఓ రేంజ్ ఫాలోయింగ్. సైరా సినిమాలో చిన్న పాత్ర చేసిన విజయ్ సేతుపతి ఉప్పెన సినిమాలో శేషారాయణం పాత్రలో జీవించేశారు. ఉప్పెన సినిమాకు ఆ రేంజ్ వచ్చింది అంటే విజయ్ సేతుపతి వల్లే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలాఉంటే ఉప్పెన తర్వాత విజయ్ సేతుపతి ఒక్క తెలుగు సినిమాకు సైన్ చేయలేదు. దానికి కారణం తమిళంలో బిజీగా ఉండటమే కాదు రెమ్యునరేషన్ అని కూడా టాక్ వినిపిస్తుంది.
విజయ్ సేతుపతి పాత్ర ఏదైనా సరే తనతో సినిమా అంటే రోజుకి కోటి ఇవ్వాల్సిందే అని అంటున్నాడట. అంతేకాదు సినిమా ప్రమోషన్స్ కి కూడా రావడం కుదరదని చెబుతున్నాడట. కాదు ఖచ్చితంగా ప్రమోషన్స్ కు రావాలని అంటే మాత్రం రోజుకి 75 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడట. తమిళంలో అతని క్రేజ్ చూసి అక్కడ అడిగినంత ఇస్తారు కానీ తెలుగు నిర్మాతలే అతని డిమాండ్ లకు వెనకడుగు వేస్తున్నారు.
Vijay Sethupathi మంచి నటుడు ఆ విషయంలో సందేహం లేదు కానీ చేసిన సినిమా ప్రమోషన్స్ కోసం కూడా ఎదురు డబ్బులు అడగడం మాత్రం కరెక్ట్ కాదని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. సందీప్ కిష హీరోగా విజయ్ సేతుపతి ఇంపార్టెంట్ రోల్ లో ఒక సినిమా తెలుగు, తమిళ భాషల్లో వస్తుంది. ఆ సినిమా తప్ప విజయ్ సేతుపతి తెలుగులో ఏ ప్రాజెక్ట్ కు సైన్ చేయలేదు.