విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి చిత్రానికి ముందు ఈ పేరు సరిగ్గా ఎవరికి తెలియదు.. కానీ ఆ చిత్రం తర్వాత రౌడీ స్టార్ కి అందరు ఫాన్స్ అయిపోయారు. ఆ చిత్రం కోసం ఎంతో కష్టపడి పనిచేశాడు. అందుకే ఫలితం మాత్రం ఓ రేంజ్ లో వచ్చింది. ఇక అక్కడి విజయ్ వెనక్కు తిరిగి చూసుకోలేదు. ఏడాది రెండు సినిమాలు చొప్పున చేసుకుంటనే వస్తున్నాడు. ఓ వైపు సినిమాలు చేస్తూనే తన బ్రాండ్ అయిన రౌడీ క్లాత్స్ నుకూడా బాగా ప్రమోట్ చేస్తున్నాడు.
వర్క్ విషయంలో విజయ్ ఎక్కడ కూడా కంప్రమైజ్ కావడం లేదు. విజయ్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. నిజానికి ఈ చిత్రం యొక్క షూటింగ్ ఎప్పుడో పూర్తి కావలిసింది…లాక్ డౌన్ వలన తొమ్మిది నెలలు షూటింగ్ కు దూరంగా ఉంది. ఇప్పుడిప్పుడే తిరిగి షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ప్రస్తుతం ముంబయి పరిసర ప్రాంతంలో షూటింగ్ జరుగుతుంది.లైగర్ టీమ్ అక్కడే ఓ హోటల్ ను రెంటుకు తీసుకొని అక్కడే ఉంటుంది.
ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ దర్శకుడు పూరీకి మరియు నిర్మాత ఛార్మికి సీరియస్ గా ఓ విషయం చెప్పాడు అంట… ఏమని అంటే త్వరితగతిన ఈ చిత్రం యొక్క షూటింగ్ ను పూర్తి చేద్దాం రాత్రి, పగలు అనే తేడా లేకుండా, అవసరం అయితే లైగర్ సెట్ లోనే నేను ఉంటాను. ఇక్కడే నిద్రపోతాను అంటూ చెప్పాడని వార్తలు వస్తున్నాయి. ఎందుకు అంటే కరోనా వలన గత ఏడాది విజయ్ నుండి ఎలాంటి సినిమా రాలేదు.
అందుకే ఎలాగైనా ఈ ఏడాది రెండు సినిమాలు విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్ కు జోడీగా అనన్య పాండే నటిస్తుంది. రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తుంది. బాక్సింగ్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుంది కావున మార్షల్ ఆర్ట్స్ లో విజయ్ శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ తో ఆకట్టుకున్న విజయ్.. సెప్టెంబర్ 9న ఈ చిత్రం విడుదల అవ్వుతుంది.