
అర్జున్ రెడ్డి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆయనతో గోతా గోవిందం సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మికా మందన్నా జోడి ప్రేక్షకులను బాగా అలరించింది. వారిద్దరి కాంబినేషన్లో ఆ తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా కూడా వారికి మంచి పేరే తీసుకొచ్చింది. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా వారిద్దరి మధ్య ప్రేమ నడుస్తుందంటూ తెగ పుకార్లు వచ్చాయి.

అయితే తాజాగా విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇందుకు నిదర్శనం వారిద్దరూ అన్ని పండుగలు కలిసి జరుపుకోవడమే అని కూడా రాస్తున్నారు. అయితే విజయ్ తల్లిదండ్రులతో కలిసి రష్మిక పలు సార్లు కనిపించిందని… న్యూయర్ వేడుకలు కూడా విజయ్, రష్మిత కలిసి జరుపుకున్నారు. వీటినే సాక్ష్యాలుగా చూపిస్తూ… వారిద్దరూ త్వరలో పెళ్లి చేబుకోబోతున్నారంటూ తెగ వార్తలు వస్తున్నాయి. అయితే వీటిపై విజయ్ దేవరకొండ ఘాటుగా స్పందించాడు.

రష్మికతో తన పెళ్లి అంటూ వస్తున్న వార్తలపై తనదైన స్టైల్ లో కౌంటర్ వేశాడు. బూతులతో ట్వీట్ చేశాడు. ఎప్పటిలాగే చెత్త వార్తల.. అంతా నాన్సెన్స్… అంటూ తిట్టిపోశాడు. అంతేనా రాయలేనటువంటి బూతు మాటలతో ఏకిపారేశాడు విజయ్ దేవరకొండ. ఇదిలా ఉండగా… విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ తో కలిసి లైగర్ మూవీలో నటింటాడు. జన గణ మన అనే సినిమా తర్వాత డైరెక్టర్ సుకుమార్ తో కలిసి మరో సినిమా చేయబోతున్నారట.