టాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ చేసిన ఏడు ఎనిమిది సినిమాలతోనే స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో ఫైటర్ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ ఆ సినిమాతో నేషనల్ లెవల్ లో రచ్చ చేసేందుకు సిద్ధమయ్యాడు. అర్జున్ రెడ్డికి బాలీవుడ్ లో క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే జాన్వి కపూర్ కూడా ఈ రౌడీ హీరో మాయలో పడి ఛాన్స్ వస్తే విజయ్ తో రొమాన్స్ కు రెడీ అనేసింది.
ఫైటర్ తర్వాత విజయ్ దేవరకొండ మరో కొత్త దర్శకుడితో మూవీ చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. అతను చెప్పిన కథకు విజయ్ ఫిదా అయ్యాడట. అందుకే వెంటనే సినిమా ఫిక్స్ చేసుకున్నటు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా స్వీటీ అనుష్క నటించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. విజయ్ తో అనుష్క ఈ జోడీ కుదిరితే మాత్రం సినిమా పీక్స్ అంటే పీక్స్ లో ఉన్నట్టే.
స్టార్ హీరోలందరితో కమర్షియల్ సినిమాల్లో రెచ్చిపోయి నటించిన అనుష్క ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. రీసెంట్ గా నిశ్శబ్ధం అంటూ వచ్చి ప్రేక్షకులను నిరాశపరచిన అమ్మడు తన నెక్స్ట్ సినిమా విజయ్ దేవరకొండతో చేస్తుందని టాక్. రీసెంట్ గా ఫ్యాన్స్ తో అనుష్క చేసిన చిట్ చాట్ లో కూడా రెండు సినిమాలకు ఓకే చెప్పినట్టు ప్రస్థావించింది అమ్మడు. అందులో విజయ్ సినిమా ఉంటుందని అంటున్నారు.
ఏది ఏమైనా విజయ్ దేవరకొండతో అనుష్క రొమాన్స్ చేస్తే మాత్రం ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది. విజయ్ రెగ్యులర్ సినిమాల్లా అందులో కూడా రొమాంటిక్ సీన్స్ ఉంటే మాత్రం కుర్రాడి పంట పండినట్టే అని చెప్పుకుంటున్నారు.