విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీ వాలా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో స్టార్ హీరోగా మారిపోయాడు తనకంటూ సఫరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్, మరియు మంచి బిజినెస్ మార్కెట్ ను ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం పురి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తెలుగు తో పాటుగా ఏకకాలంలో హిందీలో కూడా నిర్మితమవుతున్న సంగతి అందరికి తెలిసిందే.
ఈ చిత్రానికి కరణ్ జోహర్ మరియు ఛార్మి, పూరీ జగన్నాథ్ లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం యొక్క షూటింగ్ కూడా ముంబై లోనే జరుగుతుంది. విజయ్ కూడా ఈ చిత్రం యొక్క షూటింగ్ కొరకు ముంబై కి మకాం మార్చేసిన సంగతి తెలిసిందే. అక్కడే ఉన్న ప్రముఖ దర్శకులు, నిర్మాతలతో విజయ్ టచ్ లో ఉంటున్నాడు. ఇక సెలబ్రేటి ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోయిన్స్ తో విజయ్ మంచి రిలేషన్ మెయిన్టైన్ చేస్తున్నాడు. నైట్ పబ్ లు పార్టీలు అంటూ విజయ్ తెగ తిరిగేస్తున్నాడు. ఇక కరణ్ కూడా విజయ్ తో బాలీవుడ్ లో ఓ మూవీ చెయ్యాలని ఎప్పటినుండో ప్లాన్ చేస్తున్నాడు.
లైగర్ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ ఒక్కటి చెయ్యాలిసి ఉంది. ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. దాదాపుగా 100 కోట్లు కు పైగానే ఈ చిత్రాని నిర్మించబోతున్నట్లుగా తెలుస్తుంది. నిర్మాత దిల్ రాజు కూడా విజయ్ తో వార్ నేపథ్యంలో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.