తెలుగులో 2017 వ సంవత్సరంలో అర్జున్ రెడ్డి అనే చిత్రం వచ్చింది. ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ కెరీర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది. రౌడీ స్టార్ ఆక్టింగ్ కి కొత్తగా ఫ్యాన్స్ తయారు అయ్యారు. ఇప్పుడు ఆయన అంటే పడి చచ్చే డై హార్డ్ ఫాన్స్ ఉన్నారు. ఈ చిత్రానికి సందీప్ వంగ దర్శకత్వం వహించాడు. రొమాంటిక్ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది.
యూత్ ను ఈ చిత్రం ఎంతగా ఇన్స్ ఫైర్ చేసింది అంటే… చాలా మంది అర్జున్ రెడ్డి ట్రెండ్ ను ఇప్పటికి ఫాలో అవ్వుతున్నారు. ఈ చిత్రంలో విజయ్ కు జోడీగా షాలిని పాండే నటించింది. అర్జున్ రెడ్డి ఒక్క చిత్రంతో విజయ్ కు తెలుగులో వరస అవకాశాలు క్యూ కట్టాయి. గీత గోవిందం, టాక్సీవాల, నోట వంటి చిత్రాలు మంచి పేరును తీసుకు వచ్చాయి. ఇప్పుడు ఉన్న యువ హీరోలలో విజయ్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.
అర్జున్ రెడ్డి చిత్రం యొక్క రీమేక్ రైట్స్ అటు బాలీవుడ్ కు, ఇటు కోలివుడ్ కు వెళ్ళాయి. అక్కడ కూడా ఈ చిత్రం తన ప్రతాపం చూపించింది. బాలీవుడ్ లో షాహిద్ కపూర్, కియరా అద్వానీ లు జంటగా నటించారు. అక్కడ కూడా సందీప్ వంగ దర్శకత్వం వహించాడు. తమిళంలో విక్రమ్ కొడుకు దృవ్ ను ఆదిత్య వర్మ గా ఈ చిత్రంతో ఇంట్రడ్యూస్ చేశాడు.
మరోసారి అర్జున్ రెడ్డి కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుంది అనే వార్తలు సోషల్ మీడియాలో చాలా సార్లు వినిపించాయి. అయితే అవే వార్తలు నిజం అయ్యేలాగా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు విజయ్ దేవరకొండ, సందీప్ వంగ ల కాంబినేషన్ లో సినిమాను తీసుకు రాబోతున్నారు. అందుకోసం వారితో చర్చలు జరుపుతున్నారు. సందీప్ వంగ ప్రస్తుతం హింది లో షాహిద్ కపూర్ తో క్రైమ్ డ్రామా నేపథ్యంలో సాగే ఓ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నాడు.
రాశి ఖన్నా కీలక పాత్రలో నటిస్తుంది. ఈ వెబ్ సిరీస్ పూర్తి అయిన వెంటనే విజయ్ తో సినిమాను సెట్ పైకి తీసుకెళ్లనున్నాడు. ప్రస్తుతం విజయ్, పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో లైగర్ చిత్రంలో నటిస్తున్నాడు.