మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ హీరోగా ప్రస్తుతం ఓ రెండు చిత్రాలను లైన్లో పెట్టాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని అనే చిత్రంలో నటిస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతుంది. బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగు సినిమా మీడియా నుండి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం యొక్క షూటింగ్ ఏప్రిల్ చివరినాటికి పూర్తి అవ్వుతుంది. ఆ తర్వాత తన తదుపరి చిత్రం ఎఫ్3 షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఆ చిత్రానికి అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ చిత్రంలోని తన పోర్షన్ ను పూర్తి చేసిన తర్వాతే మరల గని చిత్రం యొక్క షూటింగ్ లో పాల్గొననున్నాడు.
గని చిత్రంలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి, కన్నడ హీరో ఉపేంద్ర లు కీలక పాత్రలో నటిస్తున్నారు. నవీన్ చంద్ర ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కు పోటీగా బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే వరుణ్ తేజ్ లుక్ ను విడుదల చేయగా మెగా అభిమానులు మరియు సినిమా ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. గని జూలై 30న విడుదల అవ్వుతుంది. గద్దలకొండ గణేశ్ చిత్రంతో హిట్ కొట్టి మంచి ఫామ్ లో ఉన్న వరుణ్ తేజ్ గని చిత్రంతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.