బాహుబలి చిత్రంతో ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిందో..దేశ వ్యాప్తంగా ప్రభాస్ కు అభిమానులయ్యారు. సౌత్ భామలే కాక నార్త్ హీరోయిన్స్ సైతం ఆయనతో సినిమా చేయాలనీ కోరుకుంటున్నారు. తాజాగా తెలుగు, తమిళ భాషల్లో విలన్‌గా రాణిస్తున్న వరలక్ష్మీ శరత్ కుమార్ సైతం తన మనసులోని కోరికను బయటపెట్టింది.
ఇప్పటికే ఎన్నో సినిమాల్లో విలన్‌గా కనిపించిన వరలక్ష్మి తర్వలోనే రవితేజ ‘క్రాక్’ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ ఛాన్స్ గురించి మాట్లాడింది. నేను తెలుగు సినిమాలూ చూస్తుంటా. టాలీవుడ్లో నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. బాహుబలి తమిళంలో విడుదలైనప్పటికీ నేను తెలుగులోనే చూశా. ప్రభాస్‌తో కనీసం ఒక్క సినిమా అయినా చేయాలనేది నా డ్రీమ్. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో నా మాటతీరు చూసి మగాడి గొంతులా ఉందని చాలామంది విమర్శించారు. అయితే… ఇప్పుడు ఆ మాట తీరే నా కెరీర్‌కు ప్లస్ పాయింట్ అయ్యింది. నా సినిమాలకు నేనే డబ్బింగ్ చెప్పుకునే స్థాయికి చేరుకున్నా’ అని తెలిపింది.