పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో వెండితెర పునరాగమనం చేయబోతున్నారు. హిందీ (పింక్), తమిళ్ (నేర్కొండపార్వై) భాషల్లో చిత్రాన్ని నిర్మించిన బోనీ కపూర్, దిల్ రాజుతో కలిసి నిర్మిస్తుండగా.. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లాక్ డౌన్ కు ముందు దాదాపు 70 % షూటింగ్ పూర్తి చేసుకోగా..లాక్ డౌన్ అనంతరం రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ మొదలయింది.
కాగా మొన్నటి వరకు వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదలవుతుందని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు సంక్రాంతి బరిలో సినిమా రావడం లేదని పక్కాగా అర్ధమవుతుంది. ప్రస్తుతం రాష్ట్ర సర్కార్ 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ నడవాలని ఆదేశించింది. దీని ప్రకారం రాష్ట్రంలో థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. ముందుగా చిన్న చిత్రాలు థియేటర్స్ లలో సందడి చేసేందుకు ముందుకు వస్తున్నాయి. అయితే భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రాల నిర్మాతలు మాత్రం ఇప్పట్లో తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు ఉత్సహం చూపించడం లేదు. ముఖ్యంగా దిల్ రాజు వకీల్ సాబ్ విషయంలో అలాగే ఉన్నాడట. 50 శాతం ఆక్యుపెన్సీ సినిమా రిలీజ్ చేస్తే ఏమాత్రం లాభం ఉండదని..అందుకే మరో మూడు , నాల్గు నెలల తర్వాత పూర్తి స్థాయి థియేటర్ ఆక్యుపెన్సీ సినిమా రిలీజ్ చేస్తే లాభం ఉంటుందని భావిస్తున్నాడట. మరి అప్పటి వరకు అభిమానులు ఎదురుచూడక తప్పదు.