తమిళ దర్శకుడు శంకర్ వరస సినిమా విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈ మధ్య రోబో 2.ఓ, మరియు ఐ సినిమాలను నిరాశపరచడంతో కాస్త వెనుకపడ్డాడు. అందుకే ఆల్రెడీ హిట్ అయిన తన సినిమాలను రీమేక్ చేసే పనిలో ఉన్నాడు అందులో ఇండియన్ సినిమా ఆల్రెడీ సెట్స్ పైకి వెళ్ళింది. సగబాగం ఈ చిత్రం యొక్క షూటింగ్ జరుపుకుంది. కరోనా కారణంగ షూటింగ్ వాయిదా పడింది. ఆ చిత్రా నిర్మాతలు అయిన లైకా ప్రొడక్షన్స్ వారు కూడా షూటింగ్ ను ఇప్పట్లో మొదలు పెట్టె ఆలోచనలో లేరు.
అందుకే శంకర్ ఈ గ్యాప్ లో రామ్ చరణ్ తో సినిమాను అనౌన్స్ చేశాడు. ఇండియన్ 2 నిర్మాతలు శంకర్ పై కోర్టులో కేసు వేశారు. తాను మొదలు పెట్టిన సినిమా పూర్తి కాకుండా ఎలాగ మరో సినిమాను మొదలు పెడుతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా శంకర్ తనకు ఎంతగానో పేరు తెచ్చిన అపరిచితుడు చిత్రాన్ని పాన్ ఇండియా లేవల్లో రణవీర్ సింగ్ తో రీమేక్ చేయబోతున్నట్లుగా ఇటీవలే ప్రకటించాడు. అపరిచితుడు ఒరిజనల్ నిర్మాత అయిన వి రవిచంద్రన్ శంకర్ కు మైయిల్ చేశాడు అపరిచితుడు సినిమా హక్కులు నావి అవి రైటర్ సుజాత నుండి నేను కొనుగోలు చేశాను.
దానిపై మీకు ఎలాంటి హక్కులేదని ఆ మెయిల్ లో పేర్కొన్నాడు. అందుకు శంకర్ ఘాటుగానే ఓపెన్ లెటర్ ను రవిచంద్రన్ కు రాశాడు. అపరిచితుడు చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాద్యతలు నావి సుజాతవి కేవలం మాటలు మాత్రమే … ఈ విషయంపై మీరు కోర్టుకు వెల్లుతా అని మాత్రం బెదిరించకండి అంటూ ఓపెన్ లెటర్ ను రాశాడు. త్వరలోనే అపరిచితుడు సినిమాకు సంబందించిన కాంట్రవర్శి పై ఓ క్లారీటీ రానున్నది.