కరోనా లాక్ డౌన్ తో థియేటర్స్ మూతపడడం తో సినీ ప్రేక్షకులంతా టీవీలకు , ఓటిటి చానెల్స్ కు హత్తుకుపోయారు. ఇదే తరుణంలో చిన్న, పెద్ద చిత్రాల శాటిలైట్ రైట్స్ కొనుగోలు చేసిన టీవీ చానెల్స్ వాటి ప్రసారాలతో భారీగా టిఆర్పీ రేటింగ్ సాధించి రికార్డ్స్ బ్రేక్ చేసాయి. మహేష్ బాబు, అల్లు అర్జున్ , సాయి ధరమ్ తేజ్ , చిరంజీవి ఇలా వీరు నటించిన కొత్త చిత్రాలు బుల్లితెర ఫై అత్యధిక రేటింగ్ సాధించి వార్తల్లో నిలిచాయి.
ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ చిత్రం జెమిని టీవీ లో మొదటిసారి ప్రసారమై ఏకంగా 29.4 టీఆర్పీ రేటింగ్ సాధించి అత్యధిక రేటింగ్ సాధించిన చిత్రంగా ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. రెండవ స్థానంలో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమా నిలిచింది. 23.4 టీఆర్పీ రేటింగ్ తో రెండో స్థానంలో నిలువగా .. మూడవ స్థానంలో సరిలేరు నీకెవ్వరూ రెండవ సారి టెలికాస్ట్ 17.4 రేటింగ్ సాధించింది. రెండవ సారి టెలికాస్ట్ సమయంలో ఈ రేంజ్ లో రేటింగ్ దక్కించుకోవడం విశేషం. నాల్గవ స్థానంలో 15.13 రేటింగ్ ను దక్కించుకున్న ప్రతి రోజు పండుగే సినిమా నిలిచింది. చిరంజీవి నటించిన సైరా చిత్రం 11.8 రేటింగ్ సాధించి ఐదో స్థానంలో నిలిచింది. మొత్తం మీద లాక్ డౌన్ సమయంలో బుల్లితెర ఫై పెద్ద చిత్రాలతో పాటు చిన్న చిత్రాలు సందడి చేసాయి.