బాలీవుడ్ చిత్రసీమ లో వరుస విషాదాలు సినీ ప్రేక్షకులను , ప్రముఖులను శోక సంద్రంలో పడేస్తున్నాయి. ఇప్పటికే పలు కారణాలతో పలువురు మరణించగా..తాజాగా బుల్లితెర నటుడు ఆశిష్ రాయ్ మృతి చెందారు. కిడ్నీలు చెడిపోవడంతో ఈయన మరణించినట్లు తెలుస్తుంది.
‘ససురాల్ సిమర్ కా’ టీవీ షో తో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆతరువాత వరుస అవకాశాలతో సీరియల్ నటులలో తనదైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అంతేకాకుండా ‘రాజా నట్వర్లాల్’ సినిమాలో కనిపించారు. కిడ్నీ సమస్య కారణంగా ఈ సంవత్సరం మేలో ముంబై ఆసుపత్రిలో చేరారు. కొన్ని రోజులకు ఆయనను ఐసీయూకు తరలించారు. అయితే అతడు ఈ రోజు ఉదయం 3 గంటల 45 నిమిషాలకు కుప్పకూలిపోయారని, డయాలసిస్ జరుగుతుందని ఆయన స్టాఫ్ తెలిపారు.