గోపీచంద్ మలినేని తెలుగు దర్శకుడు. శ్రీహరి హీరోగా నటించిన పోలీస్ సినిమాకు సహాయ దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన గోపిచంద్, శ్రీహరి నటించిన నాలుగు సినిమాలకు పనిచేశాడు. అనంతరం ఇవివి సత్యనారాయణ దగ్గర రెండు సినిమాలకు, శ్రీను వైట్ల దగ్గర అందరివాడు, వెంకీ, ఢీ సినిమాలకు, మురుగ దాస్ దగ్గర స్టాలిన్ సినిమాకు, శ్రీవాస్ దగ్గర లక్ష్యం సినిమాకు, మెహర్ రమేష్ దగ్గర కంత్రి, బిల్లా సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ఆ తర్వాత డాన్ శీను తో డైరెక్టర్ గా మారి హిట్ కొట్టాడు. బాడీగార్డ్ , బలుపు, పండగ చేస్కో , విన్నర్ చిత్రాలను డైరెక్ట్ చేసిన ఈయన..ఇప్పుడు హ్యాట్రిక్ హీరో రవితేజ తో క్రాక్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సంక్రాంతి బరిలో రానున్న ఈ చిత్ర ప్రమోషన్స్ జోరుగా నడుస్తుంది.
క్రాక్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో రవితేజ కంటే డైరెక్టర్ గోపీచంద్ మలినేని షాట్స్ ఎక్కువయ్యాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఇప్పటి వరకు క్రాక్ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ పబ్లిసిటీ కంటెంట్ చూస్తే హీరో హీరోయిన్స్ కంటే కూడా డైరెక్టర్ షాట్స్ విజువల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయని గోపీచంద్ మలినేని పై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించి నెట్టింట ఫన్నీ జోక్స్ పేలుతున్నాయి.