మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఖలేజా అనే సినిమా వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో మరల వీరి కాంబినేషన్ లో సినిమా గురించి ఇప్పటివరకు ఎటువంటి న్యూస్ లేదు కానీ మరోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించున్నాడు. కాకపోతే ఇది ఒక యాడ్ షూట్. మహేష్ బాబు పలు బ్రాండ్ కంపెనీలకు యాడ్స్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.
అందులో ముఖ్యంగా థమ్సప్, బైజూస్. ఇలా ఎన్నో రకాల కంపెనీలకు మహేష్ యాడ్స్ చేస్తూ ఉంటాడు. సినిమా ఆదాయం కంటే మహేష్ యాడ్ ల మీదనే ఎక్కువగా సంపాదిస్తున్నాడు అని బయట ఓ టాక్ కూడా ఉన్నది. ప్రస్తుతం మహేష్ మరో రెండు పెద్ద కంపెనీలకు ప్రమోషనల్ యాడ్ చేయబోతున్నాడు. అందులో ఓ యాడ్ షూట్ ను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించనున్నాడు. అందుకు త్రివిక్రమ్ కు 30 లక్షలు రెమ్యూనరేషన్ కూడా ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరోసారి వీరి కాంబినేషన్ లో యాడ్ షూట్ రూపొందబోతుంది అంటే అటు మహేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరి కొందరు నెటిజన్స్ మాత్రం త్వరలో వీరి కాంబినేషన్ లో సినిమా కూడా రావాలని సోషల్ మీడియా వేధిక కామెంట్స్ చేస్తున్నారు. వీరి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేష్ మాత్రం సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమాకు స్క్రీన్ ప్లే డైలాగులు అందిస్తున్నాడు. త్వరలో ఎన్టిఆర్ తో పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు. ఈ చిత్రానికి అయిననూ పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.