
ప్రస్తుతం సినీ పరిశ్రమని కరోనా షేక్ చేస్తుంది. తెలుగు పరిశ్రమలో ఇప్పటికే సెలబ్రిటీస్ కు వరుస వెంట కరోనా షాక్ ఇస్తుంది. లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్, మ్యూజిక్ డైరక్టర్ థమన్ లకు కరోనా సోకగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ కూడా కొవిడ్ బారిన పడినట్టు వెల్లడించారు. త్రిష తన సోషల్ మీడియాలో తనకు కరోనా సోకినట్టు చెప్పుకొచ్చారు.
అందరు వ్యాక్సిన్ లను వేసుకోవాలని. సేఫ్ గా ఉండాలని సూచించింది. త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తానని రాసుకొచ్చింది త్రిష. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న త్రిష ఈమధ్య కేవలం తమిళ సినిమాలనే చేస్తూ కెరియర్ కొనసాగిస్తుంది. త్రిష కృష్ణన్ కు కరోనా అని తెలియగానే ఆమె ఫ్యాన్స్ లో కంగారు మొదలైంది. వెంటనే ఆమె క్షేమంగా ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం రెండు తమిళ సినిమాల్లో నటిస్తున్న త్రిష తెలుగులో అవకాశం వచ్చినా కూడా లైట్ తీసుకుంటుంది. టాలీవుడ్ నుండి సీనియర్ హీరోల ఛాన్సులు వచ్చినా అమ్మడు సున్నితంగా తిరస్కరించిందని తెలుస్తుంది.