త్రిష కృష్ణన్ తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్ లో చాలా చిత్రాలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళ, కన్నడ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తమిళనాడులో సెటిల్ అయి అక్కడే ఉంటుంది. త్రిష మరోసారి చిరంజీవి సినిమాలో నటించనున్నదనే వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈమె కొరటాల శివ ఆచార్య చిత్రంలోనే నటించాలిసింది. కానీ అప్పుడు ఆమెకు డేట్స్ ఆడ్జెస్ట్ అవ్వకపోయేసరికి నటించలేదు.
ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా ఆడియో ఫంక్షన్ లో చెప్పాడు. ఆ సమయంలో మెగా ఫ్యాన్స్ ఆమెపై విపరీతంగా ట్రోల్స్ చెయ్యడం మొదలు పెట్టారు. చిరంజీవి ఇచ్చిన క్లారిటీ తో శాంతించారు. ఇప్పుడు మరోసారి త్రిష మెగాస్టార్ సినిమాలో నటించనున్నదనే వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం ఏమిటి అంటే మెగాస్టార్ తన తదుపరి సినిమాను మలయాళం మూవీ లూసిఫర్ ను తెలుగు రీమేక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మొదట చాలా మంది తెలుగు దర్శకుల పేర్లు వినిపించిన చివరకు తమిళ దర్శకుడు మోహన్ రాజ చేతిలోకి వెళ్లింది.
తెలుగు నేటివిటీకి తగిన విదంగా ఇప్పటికే స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేశాడు. త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నది. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం మొదట నయనతార ను అనుకున్నారు అంట కానీ నయన్ కు ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగ ఆమెకు ఈ ఆఫర్ ను చాలా సున్నితంగా తిరస్కరించారు. ఇప్పుడు ఆ పాత్ర కోసం త్రిషను ఒకే చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఓ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం మోహన్ రాజ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు.