నటి ఆమని తెలుగు ప్రేక్షకులకు ఈమె అంటే తెలియని వారు ఎవరు ఉండరు.. జగపతి బాబు గారితో ఎక్కువ సినిమాలు చేసింది. వీరిద్దరి ఫేర్ కూడా చాలా బాగుంటుంది అనే సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే తెలుగులో ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో నరేశ్ హీరోగా నటించిన జంబలకడిపంబ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ తర్వాత చాలా హిట్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. పెళ్లి తర్వాత ఆమని సినిమాలకు దూరం అయింది.
దాదాపు పది సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత ఆమె దేవస్థానం అనే సినిమా ద్వారా సినిమాలోకి మరల రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తల్లి పాత్రలు, అటువంటివి చేస్తుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి పై తనకు ఉన్న అభిమానాన్ని ఆమె బయటపెట్టింది. అవును ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. చిరంజీవి ఖైదీ సినిమా ను నేను బేగళూరు లోని ఓ థియేటర్ లో చూశాను. అప్పుడు నేను 5 వ తరగతి చదువుతున్నాను. ఆ సినిమా నుండి నాకు చిరంజీవి అంటే అభిమాను ఏర్పడింది. మా అమ్మ నాన్న లు డబ్బులు ఇస్తే వాటిని దాచుకొని చిరంజీవి గారి సినిమాలు చూసేదాన్ని ఆ విదంగా చిరంజీవిపై క్రష్ ఏర్పడింది.
ఆ తర్వాత చిరంజీవి గారు హీరోగా నటించిన రిక్షావోడు చిత్రానికి ముందుగా నన్నే హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ ఆ చిత్రానికి దర్శకుడు మరడంతో నన్ను తీసేశారు. ఆ సమయంలో నాకు చాలా బాద అనిపించింది. కానీ ఈసారి ఎలాగైనా చిరంజీవి గారి తో తప్పకుండ నటిస్తాను అని ఆమని చెప్పారు. ప్రస్తుతం ఆమని కార్తికేయ హీరోగా నటించిన చావు కబురు చల్లగా అనే చిత్రంలో నటించింది. అలాగే జగపతి బాబు గారి తో ఓ సినిమాలో నటిస్తుంది. ఆమని తన సెకండ్ ఇన్నింగ్స్ లోనూ చాలా బిజీగా ఉంది