బాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులకు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ లు డ్రగ్స్ కేసులో సమన్లు పొందిన విషయం తెలిసిందే. ఈ కేసులో బాలీవుడ్ కు చెందిన మరింత మంది ప్రముఖులు కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం 25 మందితో కూడిన జాబితాను ఇప్పటికే రెడీ చేయగా వారిని విచారించగా మరింత మంది ఈ జాబితాలో కి వచ్చి చేరే అవకాశం ఉన్నట్లుగా జాతీయ మీడియాలో వార్తా కథనాలు వస్తున్నాయి.
కేవలం బాలీవుడ్ ప్రముఖులు మాత్రమే కాకుండా టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు కూడా ఈ కేసుతో సంబంధం ఉండి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో టాలీవుడ్ ప్రముఖులు కేసులో నిందితుల విచారణ ఎదుర్కొన్న అయితే ఆ కేసుని అర్ధాంతరంగా ఆపివేయడం తో పాటు పలువురు ప్రముఖులు అని సేవ్ చేయడం జరిగింది అంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఈ కేసుని జాతీయ దర్యాప్తు సంస్థ ఎంక్వయిరీ చేసిన కారణంగా కచ్చితంగా టాలీవుడ్ ప్రముఖులు శిక్ష అనుభవించాల్సి రావచ్చు అంటూ ప్రచారం జరుగుతోంది.