పవన్ కల్యాణ్ సినిమా అంటే మామూలుగా ఉండదు. పీకే సినిమా అంటే అభిమానులకు పూనకాలే అని చెప్పాలి. ఆయన సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తారో తెలిసిందే. పీకే సినిమా అంటే కేవలం అభిమానులే కాదు.. సినీ ఇండస్ట్రీ మొత్తం ఆత్రుతగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే.. పవన్ కల్యాణ్ సినిమాకు జరిగే మార్కెట్ అంతా ఇంతా కాదు మరి.
పవన్ కల్యాణ్ సినిమా కు వచ్చే ఓపెనింగ్స్ భారీ స్థాయిలో ఉంటాయి. సినిమాకు ఖర్చు అయిన దాంట్లో సగానికి కంటే ఎక్కువ కేవలం ఓపెనింగ్స్ రూపంలోనే వస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కేవలం థియేటర్లలోనే కాకుండా శాటిలైట్ రైట్లు అదే స్థాయిలో అమ్ముడు పోతాయి. ఓవరాల్ గా పవన్ సినిమాలకు బిజినెస్ మామూలుగా ఉండదు. ఈ మధ్య పవన్ రాజకీయాల్లోకి దిగడంతో.. ఆయన నుంచి అప్పుడప్పుడు మాత్రమే సినిమాలు వస్తున్నాయి. కేవలం అతిథిగానే చిత్రాలు చేస్తున్నారు. దాంతో రాకరాక వచ్చే సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హిట్టు ఫ్లాపులతో పని లేకుండా పీకే సినిమాలకు భారీగా బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.
తాజాగా.. పవన్ కల్యాణ్, రానా కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా భీమ్లా నాయక్. మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేకే భీమ్లా నాయక్. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించగా… సాగర్ చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించారు. దర్శకుడు సాగర్ చంద్ర అయినప్పటికీ… త్రివిక్రమే అన్ని తానై చూసుకున్నారు.
భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు రూ. 109.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భీమ్లా నాయక్ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.110 కోట్ల వరకు షేర్ రావాలి. ఇప్పటి వరకు 2022లో ఇదే బిగ్గెస్ట్ రిలీజ్ బిజినెస్ కూడా. భీమ్లా నాయక్‌కు హిట్ టాక్ వస్తే భారీగా వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.