మెగాస్టార్ చిరంజీవి 152 వ చిత్రం ఆచార్య. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం యొక్క థియేట్రికల్ రేట్స్ పై రెండు నెలల ముందు నుంచే గట్టిపోటీ నెలకొన్నది. నైజాం రైట్స్ ను వరంగల్ శ్రీను, దిల్ రాజుతో పోటీ మరి 42 కోట్లకు దక్కించుకున్నాడు.
ఆంధ్ర షెర్స్ 60 కోట్ల మీద ఉండటం విశేషం అని చెప్పాలి. తాజా సమాచారం మేరకు ఈ చిత్రం యొక్క ఓవర్సీస్ రైట్స్ దిమ్మ తిరిగే రేటుకు అమ్ముడు పోయాయి. ఎంతో తెలిస్తే నోరు వెళ్లబెట్టడం ఖాయం. ఫారెన్ కంట్రీస్ లో కరోనా వైరస్ ఉన్న కూడా లెక్క చేయకుండా హాట్ ప్రైస్ కు అమ్ముడు పోయింది. ఈ చిత్రం యొక్క విదేశీ రేట్స్ ఏకంగా 11 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది. ఈ సినిమా పై ఈ రేంజ్ ప్రైస్ రావడానికి ప్రధాన కారణం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి కలిసి నటించడమే అని తెలుస్తుంది.
ఇప్పటికే ఇద్దరు ఫస్ట్ లుక్, టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచారు. ఓటమి అంటే ఏమిటో తెలియకుండా వస్తున్న దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం. ఈ చిత్రంలో పూజ హెగ్డే చరణ్ కు జోడీగా నటిస్తుంది. కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్స్ పై ఈ చిత్రాని నిర్మించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. మే 13 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగ విడుదల అవ్వుతుంది. చిరంజీవి 153 వ చిత్రంగా మలయాళం మూవీ లూసిఫర్ తెలుగులో రీమేక్ అవ్వుతుంది. రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ తో బిజీగా ఉన్నాడు.