తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవి ప్రాంతంలో అటు ఇటు గా రెండు నెలల పైనే సుకుమార్, అల్లు అర్జున్ లు అడవిలో గడిపారు. ఎందుకు అనగా గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప అనే చిత్రంను రూపొందిస్తున్నాడు దర్శకుడు సుకుమార్. కావున అక్కడ భారీ సెట్ ను నిర్మించారు మేకర్స్. అక్కడ అల్లు అర్జున్ తో ఓ యాక్షన్ షెడ్యూల్ ను, మరియు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
ఆ తర్వాత పుష్ప టీమ్ కేరళ కు బయలు దేరి వెళ్ళింది. ఈ షెడ్యూల్ తో పుష్ప షూటింగ్ 50 శాతం పూర్తి అవ్వుతుంది. పుష్ప చిత్రం కోసం వేసిన భారీ సెట్ ను కొరటాల శివ ఉపయోగించుకుంటున్నాడు. అవును ఆచార్య చిత్రం యొక్క నెక్స్ట్ షెడ్యూల్ కోసం మారేడుమిల్లి అడవికి బయలుదేరారు. ఇక్కడ రామ్ చరణ్, చిరంజీవి లపైనా ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లుగా సమాచారం. కొరటాల శివ వేసిన ప్లాన్ కు ఆచార్య చిత్రం యొక్క నిర్మాతలకు బడ్జెట్ విషయంలో కాస్త ఖర్చు తగ్గినట్లే.
ఈ చిత్రాని రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ కు వరస కు బావ కావడంతో ఒకరికి మరొకరు సాయం చేసుకుంటూ వెల్లుతున్నారు. ఆచార్య చిత్రంలో కాజల్ అగర్వాల్, పూజ హెగ్డే లు హీరోయిన్స్ గ నటిస్తున్నారు. ఈ చిత్రం మే 13 న విడుదల అవ్వుతుంది.
పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ పుష్పారాజ్ అనే డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాని మైత్రి మూవీ మేకర్స్, ముత్తమ్ శెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 13 ఆగష్టు న విడుదల అవ్వుతుంది. బన్నీ కి జోడీగా రష్మిక మందన నటిస్తుంది.