బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఇటీవలే ముగిసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఆదవ టైటిల్ విన్నర్ గా వీజే సన్నీ గెలిచాడు. అయితే ఈ ఈవెంట్ రోజే నాగార్జున ఓ ప్రకటన చేశారు. తెలుగులో బిగ్ బాస్ ఓటీటీ రానున్నట్లు వెల్లడించారు. తాజాగా ఈ షోకు సంబంధించి తెలుగు ఓటీటీ లోగోను విడుదల చేశారు.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఈ ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రామ్ త్వరలోనే ప్రారంభం కానుంది. బిగ్ బాస్ హౌస్ ఈ సారి మీ చూపు తిప్పుకోనీయదు అంటూ హామీ ఇచ్చింది. బిగ్ బాస్ షో అభిమానులందరూ ఇందు కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అభిమానులను ఇప్పుడు వినోదాన్ని మరో స్థాయిలో ఆస్వాదించే రీతిలో బిగ్ బాస్ రూపు దిద్దుకుంటోంది. తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే ఐదు సీజన్స్ ను పూర్తి చేసుకుంది. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్ ను జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండో సీజన్ ను నాని హోస్ట్ చేశారు. మూడు, నాలుగు, ఐదు సీజన్స్ ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు.
బిగ్ బాస్ ఒకటి నుంచి ఐదో సీజన్ వరకు కార్యక్రమం అంతా రోజూ గంట సేపు మాత్రమే ప్రసారం అయ్యేది. రోజంతా జరిగినదంతా కుదించి, ఎడిట్ చేసి, ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తారని అనుకున్న కంటెంట్‌ను గంట సేపు మాత్రమే ప్రసారం చేసే వారు. వారం చివరలో హోస్ట్ వచ్చి వారితో గడిపే వారు. కంటెస్టెంట్లతో రక రకాల ఆటలు ఆడిస్తారు. వారం అంతా జరిగిన దానిపై కంటెస్టెంట్లతో కలిసి చర్చిస్తారు. ఆ వారం ఎలిమినేషన్ లో ఉన్న కంటెస్టెంట్ల తో గేమ్స్ ఆడిస్తారు. ఆదివారం రోజు ఎలిమినేషన్ ప్రక్రియ సాగుతుంది. అలా వారానికి ఒక్కరిని హౌజ్ నుండి బయటకు పంపిస్తారు.
బిగ్ బాస్ పై చాలా మంది ఆటగాళ్లు, హౌజ్ చాలా రోజులు ఉండి గేమ్ ఆడి బయటకు వచ్చిన వారు చేసే కామెంట్ ఏంటంటే… రోజంతా జరిగినదంతా కేవలం గంట మాత్రమే చూపిస్తే చాలా కంటెంట్ కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. ఇందులో కంటెస్టెంట్ల మధ్య చాలా సంభాషణలు, గొడవలు, అలకలు, వాగ్వాదాలు జరుగుతాయని.. కానీ బిగ్ బాస్ టీమ్ మాత్రం కొంత మాత్రమే ప్రేక్షకులకు చూపిస్తారని.. దాని కారణంగా ఒక కంటెస్టెంట్ పై మరో కంటెస్టెంట్ నెగెటివ్ గా లేదా పాజిటివ్ గా చూపించడానికి వీలు అవుతుందని అనేవారు.
అయితే కొత్తగా వచ్చే ఓటీటీ బిగ్ బాస్ మాత్రం 24 గంటలు ప్రసారం అవుతుందని చెబుతున్నారు. కేవలం గంట మాత్రమే వచ్చే ప్రోగ్రామ్ ఇప్పుడు 24 గంటలు రావడం అంటే.. హౌజ్ లో జరిగే ఏ ఒక్క సీన్ ను కూడా ఎడిట్ చేయకుండానే ప్రేక్షకులకు చూపించనున్నారని తెలుస్తోంది. దీని వల్ల హౌజ్ లో ఏం జరుగుతుంది.. కంటెస్టెంట్ ల ఆట తీరు, వ్యవహార తీరు ప్రేక్షకులకు స్పష్టంగా తెలుస్తుందని అభిమానులు అనుకుంటున్నారు. బిగ్ బాస్ టీం ఎడిటింగ్ జిమ్మిక్కులు ఏ మాత్రం పని చేయవని చెబుతున్నారు.
000000000000000000000000