ప్రపంచ వ్యాప్తంగా బిగ్‌బాస్‌కు మంచి క్రేజ్ ఉంది. అంత క్రేజ్ ఉండటం వల్ల హిందీ బిగ్ బాస్ దాదాపు 13 ఏళ్లుగా కొనసాగుతోంది. తెలుగులో మూడు సీజన్‌లు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఆ కారణంగానే కరోనా సమయం అయినా కూడా నిర్వాహకులు డేర్ చేసి బంగారు బాతును ఎందుకు వదిలేయాలనుకుని సీజన్ ను మొదలు పెట్టారు. నాల్గవ సీజన్ సాదారణంగా కంటే రెండు నెలలు ఆలస్యం అయ్యింది.
మామూలుగా అయితే ఇప్పటి వరకు పూర్తి అవ్వాల్సి ఉంటుంది. కాని ఈసారి మాత్రం వారం రోజుల క్రితమే ప్రారంభం అయ్యింది. లాక్ డౌన్ వల్ల స్కూల్స్ లేవు, కాలేజ్ లు లేవు. కనుక బిగ్ బాస్ షో రేటింగ్ భారీగా ఉంటుందని అంతా అనుకున్నారు. కాని మొదటి వారం రేటింగ్ చూస్తే కాస్త నిరాశ గా మాటీవీ వారు ఉన్నట్లుగా తెలుస్తోంది. బిబి3 రేటింగ్ విషయంలో రికార్డు సృష్టించింది.
నాగార్జునకు మంచి బూస్ట్ తెచ్చింది. ఆ స్థాయి రేటింగ్ రావడం వల్లే నాగార్జునకు భారీ పారితోషికం ఇవ్వడంతో పాటు ఈసారి మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌తో నిర్వాహకులు ప్లాన్ చేశారు. కాని బిగ్‌బాస్ సీజన్ 4 మొదటి వారంలో మాత్రం ఆశించిన రేటింగ్ రాలేదు అంటున్నారు. స్టార్ మా వారు 20 మించి టీవీఆర్ వస్తుందని ఆశించారు. కాని వచ్చింది మాత్రం 18.5 మాత్రమే. ప్రతి 3 తెలుగు వారిలో ఇద్దరు బిగ్ బాస్‌ను మొదటి ఎపిసోడ్ లో చూశారు అంటూ స్టార్ మా వారు చెబుతున్నా అది ఎంత వరకు కరెక్ట్ అనేది మాత్రం క్లారిటీ లేదు.
మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 4 రేటింగ్ విషయంలో మొదటి వారం నిరాశ పర్చినా రెండవ వారం నుండి రచ్చ ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే షో లో ఉన్న పులిహోర బ్యాచ్ మరియు ముద్దుగుమ్మల అందాల ప్రదర్శణ మొత్తం షో తీరును మార్చేస్తుంది. అందుకే రెండవ వారంలో రచ్చ రచ్చగా రేటింగ్ వస్తుందని నమ్మకంగా ఉన్నారు.