తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4 మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కాబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కరోనా కారణంగా కంటెస్టెంట్స్ ను రెండు వారాలుగా క్వారెంటైన్ లో ఉంచుతున్నారు. వారికి రెగ్యులర్ గా కరోనా పరీక్షలు చేయించారు. ఇప్పటి వరకు ముగ్గురికి కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. వారు త్వరలోనే నెగటివ్ వస్తుందని వెయిట్ చేస్తున్నారు.
వారికి నెగటివ్ వచ్చిన తర్వాత షూటింగ్ ప్రారంభం కాబోతుంది. కరోనా పాజిటివ్ వచ్చిన వారు కోలుకుని షో లో పాల్గొంటారు అంటున్నారు. ఈసారి షో విషయంకు వస్తే కరోనా కారణంగా పలు మార్పలు చేర్పులు చేయబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే జరిగి పోయాయి. అయితే ఆ మార్పుల వల్ల షో ఆసక్తిగా ఉంటుందా లేదా అనేది చూడాలి.
కరోనా భయంతో గతంలో వేరే భాషకు చెందిన బిగ్ బాస్ షోను మద్యలో నిలిపేయడం జరిగింది. ఇప్పుడు తెలుగు బిగ్‌బాస్‌ను మాత్రం చాలా ధైర్యంగా ముందుకు తీసుకు వెళ్తున్నారు. కరోనా భయం ఇంకా జనాల్లో ఉంది. అయినా కూడా బిగ్‌బాస్ అనడంతో కాస్త ఆసక్తి చూపిస్తున్నారు. అయితే హౌస్‌మెంట్స్ ఆరోగ్యం విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటీ అనే విషయంలో కొందరు ప్రశ్నలు గుప్పిస్తున్నారు.
ఎవరికి తోచిన విధంగా వారు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కరోనా నేపథ్యంలో బిగ్‌బాస్ గురించి ప్రేక్షకుల్లో గందరగోళంగా పరిస్థితి ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కంటెస్టెంట్స్ కు కరోనా అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసలేం జరిగింది అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. స్టార్ మా మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. తేదీ ప్రోమో విడుదల చేశారు. అయితే షోకు సంబంధించి మరే విషయాలను వెళ్లడి చేయలేదు. కనుక సెప్టెంబర్ 6వ తారీకు వరకు ఆగితే కాని అన్ని విషయాలపై క్లారిటీ రాదు.