సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్..నెటిజన్లను ఆసక్తికర ప్రశ్న అడిగి వార్తల్లో నిలిచాడు. చిత్రలహరి , ప్రతి రోజు పండగే చిత్రాలతో మెగా హిట్స్ అందుకున్న సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రం చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP బ్యానర్‌పై BVSN ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సుబ్బు డైరెక్ట్ చేస్తున్నాడు. సుబ్బు చిత్రానికి ఇది మొదటిది కావడం విశేషం. నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. క్రిస్మస్ కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ తరుణంలో చిత్ర ప్రమోషన్ లలో భాగంగా ట్విటర్ ద్వారా తన అభిమానులను ఓ ఆసక్తికర ప్రశ్న అడిగాడు. ‘బ్యాచిలర్ జీవితం బాగుంటుందా? వైవాహిక జీవితం బాగుంటుందా..?’ అని ప్రశ్నించాడు. సింగిల్‌గా ఉంటే క్రికెట్ చూడొచ్చని, పెళ్లి చేసుకుంటే సీరియల్స్ చూడాల్సి ఉంటుందంటూ ఓ ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అయితే ఈ ప్రశ్న ఫై చాలామంది చాల రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇది సినిమా కోసమే అడిగిందని కాదని , త్వరలో తేజ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు కాబట్టి ఆ తరహాలో అడిగాడని అంటున్నారు. మరి తేజ్ మనసులో ఏముందో గాని ఈ ప్రశ్న మాత్రం వైరల్ గా మారింది.