ఈ ఏడాది సంక్రాంతి కి విడుదలైన క్రాక్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టు గా నిలిచింది. రవి తేజ హీరోగా, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఈ చిత్రం వచ్చింది. సముద్రఖని కీలక పాత్రలో నటించాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ మరో ముఖ్య పాత్రలో నటించారు. అయితే ఈ చిత్రంలో సముద్రఖని నటించినటువంటి పాత్ర నిజ జీవితంలోనిది అందుకే ప్రేక్షకులు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. రవి తేజ పోలీసు ఆఫీసర్ పాత్రలో ఇరగదీశాడు.
క్రాక్ చిత్రం యొక్క ఓటిటి రైట్స్ ను అల్లు అరవింద్ దక్కించుకున్నాడు. ముందుగా ఈ చిత్రాని ఆహా లో గత నెల 29 న విడుదల చేస్తాం అని ప్రకటించింది. కానీ అనుకోని కారణాల వలన ఫిబ్రవరి 5 న విడుదల చేస్తున్నాం అని ఆహా టీమ్ మరో ప్రకటన ఇచ్చింది. ఆహా క్రాక్ కు సంబందించి అల్లు అరవింద్ మీడియా సమావేషంను ఏర్పాటు చేశాడు. ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా పాల్గొన్నాడు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ… సినిమా పైరసీ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. క్రాక్ చిత్రం ఆహా లో ఈనెల 5 న రిలీజ్ అవ్వుతుంది. క్రాక్ చిత్రాని కొంతమంది పైరసీ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు.
క్రాక్ చిత్రం పైరసీ చేస్తే నాకు వచ్చే నష్టం ఏమి లేదు. కానీ నేను ఈరోజు సైలెంట్ గా ఉంటే రేపు నేను నిర్మించిన చిత్రాలు కూడా పైరసీ కి గురయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే చాలా పైరసీ సైట్లను పట్టుకొని మూయించి వేయడం జరిగింది. అందుకు స్పెషల్ కోర్టును ఏర్పాటు చేశాం అన్నారు. గతంలో మహేశ్ బాబు, గుణ శేకర్ ల సినిమా అర్జున్ చిత్రం వరంగల్ లో పైరసీ జరిగితే స్వయంగా మహేశ్ బాబు పట్టుకొని పోలీసు లకు పట్టించాడు ఆ సమయంలో మహేశ్ బాబు పై వారు రివర్స్ కేసు పెట్టడం జరిగింది. మహేశ్ పోలీసు స్టేషన్ చుట్టూ… కోర్టు చుట్టూ చాలా సార్లు తిరిగాడు. తమ్మారెడ్డి భరద్వాజ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. పైరసీ సినిమా ఇండస్ష్ట్రి కి చాలా ప్రమాదకరం. ఇప్పుడు చాలా వరకు పైరసీని నిర్మూలించాం అని అన్నాడు.