కరోనా తో యావత్ ప్రపంచం అల్లకల్లోలం అవ్వుతుంది. దానికి విరుగుడుగా భారత్ సక్సెస్ ఫుల్ గా వ్యాక్సిన్ ను తయారు చేసింది. ప్రపంచ దేశాలు మొత్తం వ్యాక్సిన్ కోసం ఇండియా వైపు చూడటం మొదలు పెట్టాయి. చాలా దేశాలకు వ్యాక్సిన్ ను ఇండియా అందించింది. ఈ నేపథ్యంలో ఇండియా వ్యాక్సిన్ డ్రైవ్ ను మొదలు పెట్టింది చాలా మందికి ఈ వ్యాక్సిన్ పై అనేక అనుమానాలు ఉన్నాయి. వ్యాక్సిన్ తీసుకున్నవారు అనారోగ్యానికి గురై చనిపోతున్నారు అనే భావనా ప్రజల్లో మొదలైంది. అలాంటి అపోహలను పోగొట్టడానికి చాలా మంది ప్రముఖులు సెలబ్రేటిలు, రాజకీయనాయకులు వ్యాక్సిన్ డోస్ ను తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో తమిళ కామిడి నటుడు వివేక్ కూడా గుండెపోటు రావడానికి ఒక్క రోజు ముందుగా వ్యాక్సిన్ ను తీసుకున్నాడు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ… వ్యాక్సిన్ పై అపోహ విడండి ఇండియన్ గవర్నమెంట్ అందిస్తున్న కోవిషీల్డ్ లేదా కొ వ్యాక్సిన్ ను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు అన్నాడు. అయిన ఈ వ్యాక్సిన్ వేసుకున్న మరుసటి రోజే గుండె పోటుతో మరణించాడు. ఈ విషయంపై సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది వివేక్ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే చనిపోయాడు అంటూ ప్రచారం జరుగుతుంది.
మరో తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ అసలు గుండె పోటు సమస్య ఉన్న వ్యక్తికి కరోనా వ్యాక్సిన్ ఎలా ఇచ్చారు అంటూ ప్రశ్నిస్తున్నాడు. వివేక్ మరణ వార్తపై మరియు కరోనా వ్యాక్సిన్ పై ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించడానికి తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి రాధా కృష్ణన్ మీడియా ముందు కు వచ్చి మాట్లాడుతూ… వివేక్ మరణ వార్తా మమ్ములను చాలా షాక్ కు గురిచేసింది. అలాగే వివేక్ ఒక మంచి పని కోసం ముందు కు వచ్చి వ్యాక్సిన్ షాట్ తీసుకున్నాడు.
వ్యాక్సిన్ తీసుకున్న వివేక్ ను ఓ 30 నిమిషాల పాటుగా అబ్జర్వేషన్ లో ఉంచిన తర్వాత ఆయనను పంపించాము. వ్యాక్సిన్ తీసుకోవడం వలన ఆయనకు ఎలాంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేవు. కానీ ఆయన గుండె పోటు సమస్యతో బాద పడుతున్నాడు. వివేక్ హృదయ నాలాల్లో బ్లాక్స్ ను కలిగి ఉన్నాడు. అవి ఒక్క రోజుల్లో చేయడం జతగని పని…. వివేక్ కరోనా టీకా వికటించి మరణించలేదు. ఆయనకు ఉన్న గుండె పోటు జబ్బు వలన మరణించాడు అని తెలిపాడు. వివేక్ మరణం తమిళ సినిమా ఇండస్ష్ట్రి ని శోకసంద్రం లో ముంచింది.